1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 24 ఆగస్టు 2023 (19:18 IST)

ఆర్ఆర్ఆర్‌కి అవార్డుల పంట, ఉత్తమ చిత్రం ఉప్పెన

rrrmovie
ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది. ఆస్కార్ కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాలో తెలుగు చిత్రాలు హవా కనిపించింది. పుష్ప ది రైజ్ చిత్రంలో అల్లు అర్జున్ తన నటనకు గాను ఉత్తమ జాతీయ నటుడుగా ఎంపికయ్యాడు. 2021 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన ఎంపికైంది. ముఖ్యంగా తెలుగు నుంచి ఆర్ఆర్ఆర్, పుష్ప అత్యధిక కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి.
 
pushpa
pushpa
ఉత్తమ నటుడు- అల్లు అర్జున్( పుష్ప: ది రైజ్)
ఉత్తమ సంగీతం(పాటలు)- దేవిశ్రీ ప్రసాద్ ( పుష్ప)
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్- కింగ్ సాలమన్(ఆర్ఆర్ఆర్)
ఉత్తమ కొరియోగ్రఫీ- ప్రేమ్ రక్షిత్(ఆర్ఆర్ఆర్)
ఉత్తమ నేపధ్య గాయకుడు- కాల భైరవ(ఆర్ఆర్ఆర్)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- ఆర్ఆర్ఆర్(రాజమౌళి)
ఉత్తమ సంగీతం(నేపధ్య)- కీరవాణి(ఆర్ఆర్ఆర్)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్- శ్రీనివాస మోహన్(ఆర్ఆర్ఆర్)
అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం- ఆర్ఆర్ఆర్
Uppena
Uppena