1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (17:02 IST)

అల్లుడు అల్లు అర్జున్ నాకోసం ప్రచారం చేస్తారు.. స్నేహారెడ్డి తండ్రి

Allu arjun family at apolo
బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తండ్రి అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తానన్నారు. తన కోసం అల్లు అర్జున్ ప్రచారం చేస్తారని... మెగా కుటుంబంలో తాను కూడా భాగమైనందుకు ఎంతో హ్యాపీగా వుందన్నారు. సినీ నటుడిగా బన్నీ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారని, రాజకీయంగా కూడా ఆయన సేవలు అవసరమని అన్నారు. 
 
2014 ఎన్నికల్లో తాను ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేశానని.. అప్పట్లో తనకు బన్నీ ప్రచారం చేయలేదని చెప్పారు. ఈసారి తన సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా తనతో అల్లుడు అల్లు అర్జున్ వుంటారని చంద్రశేఖర్ చెప్పారు. తమతో ఎంతో ఆప్యాయంగా ఉంటారని చెప్పారు. మరి ఈ వ్యాఖ్యలపై బన్నీ ఎలా స్పందిస్తారో తెలియాల్సి వుంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.