గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2023 (12:32 IST)

పుష్ప-2 అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ రికార్డ్ అదుర్స్

Pushpa
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ పోస్టు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడు మిలియన్ల లైక్‌లను సంపాదించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేక సందర్భంగా ఈ చిత్రం నుండి పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా ఈ ఫస్ట్ లుక్‌ ప్రస్తుతం సంచలన రికార్డు సృష్టించిందని మేకర్స్ ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్ లైక్‌లను పుష్ప2 ఫస్ట్ లుక్ సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులోని శేషాచలం కొండలలో మాత్రమే పెరిగే ఎర్రచందనం స్మగ్లింగ్‌ కూలీగా ఇందులో అల్లు అర్జున్ కనిపించాడు.

అల్లు అర్జున్‌, రష్మిక మందన్న, ఫహద్‌ ఫాసిల్‌ ప్రధాన తారాగణంగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పుష్ప 2 ది రూల్‌'. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.