శనివారం, 12 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2023 (16:57 IST)

పుష్ప 2లో జాలిరెడ్డిగా మరింత కిక్‌ ఇవ్వనున్న ధనుంజయ!

Dhananjaya
Dhananjaya
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమాలో జాలిరెడ్డిగా ధనుంజయ మెప్పించాడు. కన్నడ నటుడు అయిన ధనుంజయ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన స్టిల్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈసారి మరింత ఫెరోషియస్‌గా జాలిరెడ్డి రానున్నాడని తెలిపింది. ఇందులో అల్లు అర్జున్‌ పాత్ర గురించి తెలిసిందే. తన పాత్ర తీరును త్వరలో మరింత ఆసక్తికరంగా తెలియజేయనున్నాడు.
 
పుష్ప సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న పుష్ప2 ఈసారి  ప్రపంచభాషల్లో ఎక్కువగా విడుదలచేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు దర్శకుడు సుకుమార్‌ కూడా ఓ ప్రణాళిక చేసినట్లు తెలుస్తోంది. ఆర్‌.ఆర్‌.ఆర్‌.తో పాన్‌ వరల్డ్‌ సినిమాగా ప్రమోషన్‌ సాగించిన రాజమౌళి తరహాలో తాను వెళ్ళనున్నాడని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఇందులో అనసూయ, సునీల్‌ పాత్రలు కూడా మరింత ఆకర్షిణీయంగా వుంటాయని, ఇందులో ఐటం సాంగ్‌ కోసం ప్రముఖ నటిని తీసుకోనున్నట్లు సమాచారం.