శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (17:19 IST)

నెట్‌ఫ్లిక్స్‌లో నయనతార పెళ్లి... Beyond The Fairytale teaser వీడియో వైరల్

Nayanatara
కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార జూన్ 9వ తేదీన, చిరకాల మిత్రుడు, ప్రేమికుడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ఏడడుగులు వేసింది. ఈ 37ఏళ్ళ సీనియర్ హీరోయిన్ తన సినీ కెరీర్‌తో పాటుగా మోస్ట్ మెమొరబుల్ ఫెయిరీ టేల్ మ్యారేజ్‌ను కూడా పక్కా కమర్షియల్‌గా ప్లాన్ చేసుకుంది.
 
తన పెళ్లిని ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం చేసేందుకు ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్‌తో భారీ డీల్‌ను కుదుర్చుకుంది. తమ ఓటిటిలో అధికారిక ఎంట్రీ ఇవ్వబోతున్నారని పేర్కొంటూ, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను గతంలో షేర్ చేసిన నెట్ ఫ్లిక్స్. 
 
తాజాగా సదరు సంస్థ నయన్, విఘ్నేష్‌ల పెళ్లి వీడియోకు "నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్" అనే టైటిల్‌ను ఎనౌన్స్ చేసింది. ఈ వీడియోను త్వరలోనే నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.