శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2017 (11:34 IST)

సహాయ దర్శకురాలిగా నయనతార.. 25 రోజుల్లో అరమ్ షూటింగ్ పూర్తి.. త్వరలో విడుదల

దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతారకు మంచి క్రేజ్ అవుతోంది. నయనతార అంటేనే నిర్మాతలు భారీగా పెట్టుబడి పెట్టేందుకు సై అంటున్నారు. నయన బొమ్మ పడినందుకు నిర్మాతలకు, బయ్యర్లకు కాసుల వర్షం కురిపించి డోరా చిత్రం న

దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతారకు మంచి క్రేజ్ అవుతోంది. నయనతార అంటేనే నిర్మాతలు భారీగా పెట్టుబడి పెట్టేందుకు సై అంటున్నారు. నయన బొమ్మ పడినందుకు నిర్మాతలకు, బయ్యర్లకు కాసుల వర్షం కురిపించి డోరా చిత్రం నయన పెర్‌పార్మెన్స్ వల్లే అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం నయనతార అరమ్ సినిమాలో నటిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. 
 
నవ దర్శకుడు మింజూర్‌ గోపి మెగాఫోన్‌ పట్టిన ఈ చిత్రంపైనా మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ సందర్భంగా అరమ్‌ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇందులో నయనతార జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రాన్ని నయన్‌ కేవలం 25 రోజుల్లో పూర్తి చేశారని చెప్పారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి ఆమె సహాయ దర్శకురాలిగా పనిచేశారని చెప్పారు.