శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శుక్రవారం, 9 జూన్ 2017 (05:35 IST)

సంఘమిత్రకు ఆ నటా.. వద్దే వద్దే బాబోయ్.. వణుకుతున్న నిర్మాత

ఆ నటి అంటే ఆ దర్శకుడికి పిచ్చ పిచ్చ అభిమానం. ఇప్పటికే తనకు మూడు చిత్రాల్లో అవకాశం ఇచ్చారు. తన మాట కాదని, చెప్పింది చేస్తుందని ఆమె అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. తన తాజా చిత్రం సంఘమిత్రకు కథానాయకి సెట్‌

ఆ నటి అంటే ఆ దర్శకుడికి పిచ్చ పిచ్చ అభిమానం. ఇప్పటికే తనకు మూడు చిత్రాల్లో అవకాశం ఇచ్చారు. తన మాట కాదని, చెప్పింది చేస్తుందని ఆమె అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. తన తాజా చిత్రం సంఘమిత్రకు కథానాయకి సెట్‌ కావడంలేదు. చాలా కాలంగానే ఈ చిత్రంలో నాయకి కోసం అన్వేషణ జరిగింది. చివరికి క్రేజీ నటి శ్రుతీహాసన్‌ నటించడానికి అంగీకరించి, ఆ తరువాత వైదొలిగి షాక్‌ ఇచ్చారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇలాంటి పరిస్థితిలో ఆ దర్శకుడు తన ఆస్థాన నటి హన్సికను సంఘమిత్రలో యువరాణిని చేయాలని ఆశించారట.
అయితే వ్యాపారంలో మెలికలు తిరిగిన సంఘమిత్ర చిత్ర నిర్మాత, శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ అధినేత మురళి నటి హన్సికకు తమిళంలోనే కాదు తెలుగులోనూ మార్కెట్‌లేదని, అలాంటి నటిని సంఘమిత్రలో నాయకిగా ఎంపిక చేస్తే చిత్ర వ్యాపారం మొత్తం దెబ్బతింటుందని అన్నారట. దీంతో దర్శకుడు సుందర్‌.సీ సైలెంట్‌ అయ్యిపోయారట.
 
ఆ దర్శకుడు సి. సుందర్. ఆ నటి ఎవరంటే హన్సిక. తమిళ చిత్రరంగంలో ఓ వెలుగు వెలిగిన హన్సికకు ఈ మధ్య టైమ్‌ ఏమీ బాగోలేదు. కోలీవుడ్‌లో ఒక్క చిత్రం లేదంటే నమ్మండి. లోపం ఎక్కడుండి చిత్రాల ఎంపికలోనా ఏదేమైనా హన్సికను కోలీవుడ్‌ పూర్తిగా పక్కన పెట్టేసిందన్నది నిజం. టాలీవుడ్‌లోనే అమ్మడికి ఇదే పరిస్థితి. కాగా మాలీవుడ్‌లో మాత్రం ఒక చిత్రంలో నటిస్తోంది. నిర్మాత అడ్డు చెప్పడం కారణంగా సంఘమిత్ర వంటి పవర్‌పుల్ కేరక్టర్‌లో నటించే ఛాన్స్ తృటిలో కోల్పోయింది. 
 
కాగా సంఘమిత్రలో నటి నయనతార పేరు పరిశీలనకు వచ్చినప్పటికీ  ఈ అగ్రనాయకిపైనా నిర్మాత మొగ్గు చూపలేదట. నయనతార నటించిన తిరునాళ్, డోరా వంటి చిత్రాలు అపజయం చెందడమే ఇందుకు కారణం మరి.కాగా ఏతా వాతా సంఘమిత్ర నాయకి బాలీవుడ్‌కు చెందిన బ్యూటీనే అయ్యే అవకాశం ఉందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. తమన్నానా? ఏమో.. వేచి చూడాల్సిందే మరి.