శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 1 జులై 2018 (12:58 IST)

హైదరాబాద్‌లో ''సాహో''.. హెవీ ఛేజింగ్ సన్నివేశాలు..

రెబల్ స్టార్, బాహుబలి హీరో ప్రభాస్ హీరోగా సుజీత్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ''సాహో'' చిత్రం రెండో షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ను ముగించుకుని ''సాహో'' యూనిట్ దుబాయ్ నుంచి తిరుగుముఖం పట్టింద

రెబల్ స్టార్, బాహుబలి హీరో ప్రభాస్ హీరోగా సుజీత్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ''సాహో'' చిత్రం రెండో షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ను ముగించుకుని ''సాహో'' యూనిట్ దుబాయ్ నుంచి తిరుగుముఖం పట్టింది. దుబాయ్ చిత్రీకరణలో భాగంగా స్టంట్ కొరియోగ్రఫర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో హెవీ ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు. 
 
ఇక 3వ షెడ్యూల్ జూలై 11న హైదరాబాద్‌లో మొదలుపెట్టనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ హీరోయిన్ కాగా ఇతర బాలీవుడ్ నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
ఈ చిత్రంపై టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌ లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. రన్‌ రాజా ఫేం సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం యూవీ క్రియేషన్స్‌ బేనర్స్‌‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.