శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (14:32 IST)

కోచ్‌గా మారిన ప్రియాంక చోప్రా భర్త.. ఎందుకో తెలుసా?

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను వివాహం చేసుకున్న నిక్ జోనస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన పాటలతో వెస్టర్న్ మ్యూజీషియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వెస్టర్న్ సింగింగ్ షో ది వాయిస్‌లో నిక్ కనిపించనున్నాడు. కాకపోతే అందులో కోచ్‌గా విధులు నిర్వహించనున్నాడు. ఈ 28ఏళ్ల సింగర్ గ్వెన్ స్టిఫానీకి బదులుగా రానున్నాడని సమాచారం. అయితే ది వాయిస్ సీజన్ 20లో జాన్ లెజెండ్, కెల్లీ క్లార్కసన్, బ్లేక్ షెల్టన్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. 
 
అందులో కోచ్‌గా చేయనున్న నిక్ గెలుపుకు సిద్ధం అవ్వండి అంటూ కొత్త సింగర్స్‌ను ఉత్తేజపరుస్తున్నాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఆ షో మానెజమెంట్ షేర్ చేసింది. ది వాయిస్ ఇప్పటికి 19 సీజన్లు పూర్తిచేసుకుంది. ఈ షో18వ సీజన్‌లో నిక్ కూడా ఉన్నాడు. ఈ సారి సింగర్స్‌ను కోచ్ చేస్తూ వెస్టర్న్ మ్యూజిక్‌కు ఏ రేంజ్ కొత్త మ్యూజీషియన్స్ ఇస్తాడో చూడాలి.