సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (17:38 IST)

ఎక్స్ పోజింగ్ పిక్స్ వ‌ల్ల ఉప‌యోగ‌మే అంటున్న నిధి అగ‌ర్వాల్‌

Nidhi Agarwal
నేను సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటాను. న‌టికాక‌ముందే నాకు ఒన్ మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ వున్నారు. సోష‌ల్‌మీడియా వ‌ల్ల నా ఫొటోలు చూసి నేను ప‌లానా పాత్ర‌కు స‌రిపోతాన‌ని కొంద‌రు ద‌ర్శ‌కులు పిలుస్తుంటారు. ఇది నాకు చాలా ఉప‌యోగ‌ప‌డింది` అని నిధి అగ‌ర్వాల్ తేల్చిచెప్పింది.
 
ఇస్మార్ట్ శంక‌ర్‌లో గ్లామ‌ర్ పాత్ర‌ను పోషించిన ఆమె తాజాగా హీరో సినిమాలో సంప్ర‌దాయ‌మైన పాత్ర‌లో న‌టించింది. ఇక ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫాలోవ‌ర్స్ చాలా ఘాటుగా స్పందిస్తారు. ఒక్కోసారి బాధ క‌లుగుతుంది. ఏమీ చేయ‌లేం. ఒక రూమ్‌లో న‌లుగురు వుంటే వారి మైండ్ వాయిస్ మ‌న‌కు తెలీదు. కానీ సోష‌ల్ మీడియాలో అది వ్య‌క్తం చేయ‌వ‌చ్చు. అందుకే నా పిక్స్‌కు కొంద‌రు అలా రెస్పాన్స్ అవుతున్నారంటూ పేర్కొంది. 
తాజాగా ప‌వ‌న్‌తో `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` చేసింది.  త‌ర్వాత ఇంకా ఏమీ అన‌కోలేదు. కొన్ని  క‌థ‌లు చ‌ర్చ‌ల్లో వున్నాయి. ఏప్రిల్‌లో హిందీ సినిమా ప్రారంభం కాబోతోంది. త‌మిళంలో ఉద‌య‌నిధి స్టాలిన్‌తో సినిమా చేశాను. మ‌రో సినిమా లైన్‌లో వుంది అని చెప్పింది.