సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జూన్ 2017 (19:26 IST)

ఆన్‌లైన్‌లో నాని ''నిన్ను కోరి'' ఆడియో జ్యూక్ బాక్స్ రిలీజ్ (video)

నేచుర‌ల్ స్టార్ నాని తాజా చిత్రం నిన్ను కోరి. జూలై 7న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయి. గ్లామ‌ర్ బ్యూటీ నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌లో డెబ్యూ డైరెక్ట‌ర్ శివ ని

నేచుర‌ల్ స్టార్ నాని తాజా చిత్రం నిన్ను కోరి. జూలై 7న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయి. గ్లామ‌ర్ బ్యూటీ నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌లో డెబ్యూ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా ఆడియో జ్యూక్ బాక్స్ ఆన్ లైన్‌లో విడుదల చేశారు. ఆ మ‌ధ్య సాంగ్స్ ప్రోమో విడుద‌ల చేసి మూవీపై భారీ హైప్ తెచ్చిన యూనిట్.. పాటల్ని ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 
 
గోపి సుంద‌ర్ అందించిన సంగీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా రూపొందుతుంది. త్వరలో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రంగం సిద్ధమవుతోంది.