దిల్‌రాజు, క్రిష్ నిర్మాణంలో `నూటొక్క జిల్లాల అందగాడు` చిత్రం ప్రారంభం
మంచి తెలుగు సినిమాలను ప్రేక్షకులను అందించాలని కోరుకునే నిర్మాతల్లో నిర్మాత దిల్‌రాజు ముందు వరుసలో ఉంటారు. స్టార్ హీరోలతోపాటు కొత్త దర్శకులు, కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్నారు కాబట్టే అందరూ ఆయన్ని హిట్ చిత్రాల నిర్మాత అని అంటుంటారు.
కొంతమంది నిర్మాతలతో మరిన్ని మంచి సినిమాలను తెలుగు సినీ ప్రేక్షకులకు అందించాలనే ఆలోచనలో ఉన్నట్లు, డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో వస్తే నిర్మాతగా తన వంతు సహకారం అందించి నిర్మాణంలో భాగస్వామినవడానికి తాను సిద్ధమని దిల్‌రాజు ఇటీవల తెలిపారు. ఆ ప్రయత్నంలో భాగంగా తొలి అడుడు పడింది. దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో `నూటొక్క జిల్లాల అందగాడు` అనే సినిమా రూపొందనుంది.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో రాచకొండ విద్యాసాగర్ అనే కొత్త దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ శిరీష్‌తో పాటు గమ్యం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణ వంటి సినిమాలను నిర్మించిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి `నూటొక్క జిల్లాల అందగాడు` చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వైవిధ్యమైన కథాంశంతో ఫన్ ఎంటర్‌టైనర్‌గా సినిమా తెరకెక్కనుంది. అవసరాల శ్రీనివాస్, రుహనీ శర్మ(చి.ల.సౌ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి స్వీకార్ అగస్తి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.