సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 18 అక్టోబరు 2019 (12:46 IST)

డెంగ్యూ జ్వరంతో బాలనటుడు సాయికృష్ణ మృతి

మదనపల్లె పట్టణంలోని ఏవి నాయుడు కాలనీకి చెందిన బాలనటుడు టీవీ ఆర్టిస్ట్ గోకుల్ సాయి కృష్ణ డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. బెంగళూరులో చికిత్స పొందుతూ మృతి చెందడంతో కుటుంబసభ్యులు టీవీ ఆర్టిస్టులు విషాదంలో ఉన్నారు. 
జీ తెలుగు చానెల్లో సాయికృష్ణ డ్రామా జూనియర్స్, ఆట జూనియర్స్ లాంటి టీవీ షోల్లో పాల్గొన్నాడు.