శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 అక్టోబరు 2020 (12:24 IST)

భర్త కావాలని కాదు.. వీసా సులువుగా వస్తుందనీ పెళ్లి చేసుకున్నా....

తెలుగు వెండితెరకు దర్శకుడు రాంగోపాల్ వర్మ పరిచయం చేసిన హీరోయిన్ రాధికా ఆప్టే. రక్త చరిత్రలో ఆమె నటించింది. ఈ క్రమంలో కెరీర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే ఆమె వివాహం చేసుకుంది. అదీకూడా మన ఇండియన్ కాదు. లండన్‌కు చెందిన ఓ మ్యుజిషియన్. ఆ తర్వాత లండన్‌లో స్థిరనివాసం ఏర్పరచుకుంది. కానీ, సినిమాల్లో బిజీగా ఉండటంతో ఆమె ఎక్కువ సమయం భారత్‌లోనే గడుపుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వివాహంపై స్పందించింది. విదేశాల్లో ఉన్న వ్య‌క్తిని పెళ్లాడితే వీసా సులువుగా వ‌స్తుంద‌ని తెలుసుకొని, తాను పెళ్లి చేసుకున్న‌ట్టు చెప్పింది. ప్ర‌స్తుతం తాను త‌న భ‌ర్త‌తో క‌లిసి జీవిస్తున్న‌ట్టు తెలిపింది.
 
తనకు ఇప్పటీ పెళ్లిపై ఏ మాత్రం న‌మ్మ‌క‌మే లేద‌న్నారు. ఒక స్త్రీ, పురుషుడికి మధ్య ఉండే బలమైన నమ్మకమే వివాహం అని చెప్పుకొచ్చింది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు తప్పటడుగు వేస్తే అది పెటాకులవుతుందన్నారు. అందుకే తనకు పెళ్ళంటే నమ్మకం లేదని చెప్పుకొచ్చింది. 
 
కాగా, రాధికా ఆప్టే 2012లో బ్రిటిష్‌ మ్యుజిషియన్‌ బెనెడిక్ట్ టేలర్‌ను వివాహం చేసుకుంది. అనంతరం సినిమాల్లో కొనసాగింది. ప్రస్తుతం లండన్‌లో స్థిర‌నివాసం ఏర్పరుచుకున్నా, సినిమాల కోసం ఎక్కువకాలం భారత్‌లోనే ఉంటోంది.