మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 మే 2018 (15:14 IST)

'జనని భారతి మెచ్చ.. జగతి హారతులెత్త'... సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ (First Look Teaser)

నిజానికి ఈ చిత్రానికి తొలుత దర్శకుడిగా తేజను అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నాడు. దాంతో ఆలోచనలో పడిన బాలకృష్ణ .. తనకి 'గౌతమీ పుత్ర శాతకర్ణి'తో భారీ సక్సెస్‌ను ఇచ్

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్‌ను ఆ చిత్ర నిర్మాత, హీరో నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేశారు. పైగా, ఈ చిత్రాన్ని 2019 సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
 
నిజానికి ఈ చిత్రానికి తొలుత దర్శకుడిగా తేజను అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నాడు. దాంతో ఆలోచనలో పడిన బాలకృష్ణ .. తనకి 'గౌతమీ పుత్ర శాతకర్ణి'తో భారీ సక్సెస్‌ను ఇచ్చిన క్రిష్‌ను దర్శకుడిగా ఎంచుకున్నారు.
 
క్రిష్‌ను దర్శకుడిగా ప్రకటించడంతో ఈ ప్రాజెక్టుపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. 'గౌతమీపుత్ర శాతకర్ణి' కూడా సంక్రాంతికే వచ్చి సంచలన విజయాన్ని సాధించింది. అలా 'ఎన్టీఆర్' మూవీ కూడా సంక్రాంతికే విడుదల చేయాలని నిర్ణయించారు. 
 
ఇదే అంశంపై విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రాంగణం వద్ద విలేకరులతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెరచిన పుస్తకమేనని, అందువల్ల సినిమాను ఎక్కడ నుంచి ప్రారంభించాలో, ఎక్కడ ముగించాలో తనకు బాగా తెలుసునని అన్నారు. 
 
ఈ సినిమాకు దర్శకత్వం వహించేందుకు క్రిష్ అంగీకారం తెలియజేయడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ఈ సినిమా ట్రైలర్‌కు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ గురించి అభిమానులకు తెలియని కొన్ని విషయాలను కూడా ప్రస్తావిస్తుందని బాలకృష్ణ వెల్లడించారు.