సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 మే 2018 (13:40 IST)

కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా పేరు మార్చాలి : పురంధేశ్వరి

స్వర్గీయ ఎన్టీ.రామారావు పుట్టిన కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా పేరు మార్చాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ 96వ జయంతిని పురస్కరించుకు

స్వర్గీయ ఎన్టీ.రామారావు పుట్టిన కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా పేరు మార్చాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ 96వ జయంతిని పురస్కరించుకుని ఆమె హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికపై హరికృష్ణ కూడా ఉంటే బాగుండేదన్నారు. అలాగే, కృష్ణా జిల్లా పేరును ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా మార్చాలని కోరారు. మహానాడును కాదు.. ఎన్టీఆర్ జయంతిని పండగలా జరపాలని అన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని పురందేశ్వరి కోరారు. 
 
పైగా, ఎన్టీఆర్ గురించి తాను కొత్తగా చెప్పేదేమీ లేదన్నారు. ఆయనకు సంబంధించిన అన్ని విషయాలు తెలుగు ప్రజలకు తెలుసని గుర్తుచేశారు. తెలుగువారిని కూడా మదరాసీలుగా పిలుస్తున్న కాలంలో... తెలుగువారికి కూడా ప్రత్యేక చరిత్ర ఉందని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. 
 
కాగా, విజయవాడలో జరుగుతున్న టీడీపీ మహానాడుకు హరికృష్ణతో పాటు.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌లు దూరంగా ఉండగా, హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం రెండో రోజైన సోమవారం వెళ్లారు. తొలి రోజున ఈయన మహానాడుకు దూరంగా ఉన్నారు.