శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 28 మే 2018 (13:15 IST)

దిష్టిని తొలగించడానికి గణేశుడిని ఉత్తరం వైపు ఉంచితే?

దృష్టి అంటే చూపు. మనం చూసేది. సహజంగా దేనినైనా చూడటం వలన హాని ఉండదు. ఈర్ష్యా ద్వేషాలతో చూసే చెడు దృష్టి చాలా హాని చేస్తుంది.పిడుగు పడిన పుడుచెట్లు ఎలా మాడిపోతాయో అలానే ఈ చెడు దృష్టి ప్రభావం ఉంటుంది.

దృష్టి అంటే చూపు. మనం చూసేది. సహజంగా దేనినైనా చూడటం వలన హాని ఉండదు. ఈర్ష్యా ద్వేషాలతో చూసే చెడు దృష్టి చాలా హాని చేస్తుంది. ఆ చెడుదృష్టి మనిషినైనా, మరిదేనినైనా మాడిమసి చేస్తుంది. పిడుగు పడిన పుడుచెట్లు ఎలా మాడిపోతాయో అలానే ఈ చెడు దృష్టి ప్రభావం ఉంటుంది. ఈ విషయాన్ని నిరాధారమైనదిగా మనం తీసుకోకూడదు. 
 
దుకాణాల్లో వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు ప్రతి శుక్రవారం అమావాస్య రోజుల్లో కర్పూరం వెలిగించి తమ దుకాణాల ముందు నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు ఒక దండగా గుచ్చి కట్టడం, బూడిద గుమ్మడి కాయ కట్టడం, పటిక, కొబ్బరికాయ, ఉట్టిలో వేలాడదీయడం, కొబ్బరికాయ కొట్టి పడేయడం, దిష్టితీసి బూడిద గుమ్మడికాయ కొట్టి పారేయడం, నిమ్మకాయలు దిష్టితీసి పారేయడం, పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోవడం మనం తరచూగా చూస్తూఉంటాం.
 
ఇదంతా యజమానికి వ్యాపార సంస్థకు నరదృష్టి దోషము తగలకుండా ఉండటానికే ఇప్పటికీ ఈ పద్ధతి ఆచారంగా ఉన్నది. ఈ విధంగా చెడు ప్రభావం నుంచి తమ వ్యాపార సంస్థలను, పిల్లలను రక్షించుకోవడానికి అనేక పద్ధతులు అవలంభిస్తుంటారు ఇలాంటి పద్ధతులను మూఢనమ్మకాలుగా తీసిపారేయకూడదు. ఇందులో నిజం దాగిఉంది కనుకే మన పూర్వీకులు అనుసరించే పద్ధతులు అర్థం లేనివి కావు. అనుభవం ద్వారానే నిజాలను మనం నమ్మగలం. 
 
ఈ వైజ్ఞానిక యుగంలో అనేక భయంకరమైన వ్యాధులను నయం చేసేందుకు ఎన్నో కొత్త కొత్త మందులు కనిపెట్టడం జరిగింది. కాని ఈ దిష్టి దుష్ప్ర భావాన్ని అణచి వేసేందుకు ఏ వైజ్ఞానికుడు ఏ విరుగుడు కనిపెట్టలేకపోయాడు. కనీసం ఈ విషయపై ఎలాంటి పరిశోధన చేయడం లేదు. ఇది మూఢనమ్మకమని కొందరు వాదిస్తారు. 
 
కానీ దిష్టిని సమూలంగా నాశనం చేసి ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూర్వం మనదేశంలో ప్రసిద్ధి చెందిన అనేక మంది సిద్ధిపురుషులు ఉన్నారు వారిలో మహా శ్రేష్ఠుడైన అగస్త్య మహాముని ఒకడు. ఈ మహాశక్తి ఉద్భవానికి ఆ ముని కారణమయ్యాడు. ఆ మహాశక్తి పేరు సర్వశక్తి వంతుడైన శుభదృష్టి గణపతి అశుభ దృష్టి అయిన దిష్టి రాక్షసుని సంహరించగల ఒకే ఒక్క దైవశక్తి మహాగణపతి యొక్క అనేక రూపాలలో 33వ రూపమే ఈ 'శుభదృష్టి గణపతి'. 
 
ఈ శుభదృష్టి గణపతి యొక్క రూపం చాలా విచిత్రంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు తర్వాత శంఖు చక్రాలను ధరించిన దైవశక్తి. శ్రీమహేశ్వరునికి ఈయన త్రినేత్రుడు. ఇతర దేవతల వలె అనేక ఆయుధాలను ధరించి సింహమును వాహనంగా చేసుకుని ఉంటాడు. మూషికము కూడా ఈయన పాదాల చెంత ఉంటుంది. మహా పరాక్రమశాలి రూపంతో ఈ మహాగణపతి పూర్ణ వికసిత పద్మంలో విజయోత్సాహ వీరునిలా నిలబడి ఉంటాడు. తొమ్మిది నాగదేవతలు ఈయన తలచుట్టూ తిరిగి ఉంటారు. 
 
ప్రజ్వలించు అగ్ని జ్వాలలో ఒక్క నేత్రాలతో తన సాధారణ స్వరూపానికి విరుద్ధంగా తన విశ్వరూపంతో రుద్ర స్వరూపుడు శుభదృష్టి గణపతిగా ఉద్భవించుట జరిగింది. సర్వజనులకు మేలు చేకూర్చే ఈ శుభదృష్టి గణపతి ఒక్కడే దిష్టి అనే దృష్టిని సంహరించి సర్వజనాలను రక్షించి శుభం సుఖశాంతులు సమృద్ధిగా అందిస్తాడు. ఈ శుభదృష్టి గణపతి దివ్యరూపాన్ని ఇంల్లో ఉంచుకుని నిత్యం పూజించడం ద్వారా ఇంట్లోని యావన్మంది గృహసభ్యులుపై ప్రసరించే దిష్టి యొక్క దుష్ప్రభావం సూర్యరశ్మి సోకిన మంచులా కరిగిపోతుంది. 
 
ఈ శుభదృష్టి గణపతిని కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఆఫీసులు, దుకాణాల్లో పూజించడం వల్ల దుష్ట శక్తుల ప్రభావాలు తొలగి మంచి లాభాలు, అభివృద్ధి చేకూరుతుంది. ప్రతీ ఒక్కరూ ఈ శుభదృష్టి గణపతిని ఆరాధించాలి. గృహంలో ఈ శుభదృష్టి గణపతి పటాన్ని గోడపై ఉత్తరదిశను చూసేలా తగిలించాలి. పూజాగదిలో కానీ ఇంటికి వచ్చే అందరి దృష్టి ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ శుభదృష్టి గణపతి శత్రువులను సంహరించి యుద్ధరంగం నుంచి వచ్చిన విజేతలా విజయలక్ష్మి వరించిన వీరునిగా సమర రూపంతో విజయోత్సాహంతో దర్శనమిస్తాడు.