ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 16 మార్చి 2017 (14:17 IST)

బాహుబలి 2 ట్రెయిలర్ పైన జూ.ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్... మీ ఊపిరి ఆగిపోతుంది...

బాహుబలి 2 ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే దానిని చూస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. బాహుబలి బిగినెంగ్ ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు బాహుబలి 2 కూడా అలాగే పరుగులు పెడుతోంది. ఈ ట్రెయిలర్ పైన సామాజిక మాధ్యమాల్లో వారివారి అభిప

బాహుబలి 2 ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే దానిని చూస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. బాహుబలి బిగినెంగ్ ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు బాహుబలి 2 కూడా అలాగే పరుగులు పెడుతోంది. ఈ ట్రెయిలర్ పైన సామాజిక మాధ్యమాల్లో వారివారి అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. చూసినవారంతా దర్శక ధీరుడు రాజమౌళిని శభాష్ అంటున్నారు. 
 
ఇక సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ ట్రెయిలర్ పైన జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చిత్రాలు విడుదల సమయంలోనే ట్విట్టర్లో కానీ ఫేస్ బుక్ లో కానీ పెద్దగా స్పందించరు. ఐతే బాహుబలి 2 ట్రెయిలర్ పైన జూనియర్ ఎన్టీఆర్ ఏమని రాశాలో తెలుసా...?
 
' ఈ ట్రెయిలర్ చూస్తుంటే ఈ అనుభూతిని వేరే దేనితో పోల్చడానికి సరిపోదనిపిస్తుంది. దీన్ని చూస్తుంటే మీ పల్స్ పరిగెడుతుంది. అంతేకాదు మీ ఊపిరి ఆగిపోతుంది. అలా కళ్లప్పగించి చూస్తూనే ఉంటారు. ఖుదోస్ జక్కన్నా' అంటూ ట్వీట్ చేశారు ఎన్టీఆర్. మొత్తానికి ఏప్రిల్ నెలలో బాహుబలి ఎన్ని రికార్డులు బద్ధలు కొడతాడో వెయిట్ అండ్ సీ.