సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (09:18 IST)

బాలీవుడ్ నటికి సినిమాల్లో సీన్ నిజ జీవితంలో అనుభవం

nushrratt bharuccha
బాలీవుడ్ నటి నుస్రత్ భరూచాకు సినిమాల్లో సీన్ నిజ జీవితంలో ఎదురైంది. దీంతో ఆమె ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సురక్షితంగా బయపటపడ్డారు. హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు భరూచా తన బృందం సభ్యులతో కలిసి వెళ్లింది. ఉన్నట్టుండి యుద్ధం మొదలు కావడంతో ఇజ్రాయెల్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సైట్ సీయింగ్‌కు వెళ్లిన భరూచాకు ఆమె బృందానికి సంబంధాలు తెగిపోయాయి. దీనిపై ఆందోళన చెందిన భరూచా చీమ్.. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది. 
 
భరూచా విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఎంబసీ అదికారులు అధికారులు... ఆమె ఎక్కడుందనే విషయాన్ని తెలుసుకుని, భరూచాతో ఫోనులో మాట్లాడామని ఆమె టీమ్ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉందని వెల్లడించింది. కాగా, నుస్రత్ భరూచాను క్షేమంగా స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక విమానంలో భరూచా ముంబై బయలుదేరారని ఎంబసీ అధికారులు తెలిపారు. 
 
కాగా, గతంలో నుస్రత్ భరూచాకు గతంలో తాను నటించిన సినిమా సీన్ ఒకటి ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. ప్రణయ్ మెష్రమ్ దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ డ్రామా 'అకెల్లి' సినిమాలో నుస్రత్ భరూచా నటించారు. ఇందులో ఆమె ఓ పోరాట ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయట పడేందుకు కష్టపడే ఒక సాధారణ భారతీయ అమ్మాయి పాత్ర పోషించారు. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడు కూడా ఆమె రియాలిటీలో అలాంటి పరిస్థితుల్లోనే చిక్కుకుని క్షేమంగా బయటపడ్డారు.