సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 19 జూన్ 2023 (16:56 IST)

ఓ మంచి ఘోస్ట్ చిత్రం నుంచి ఓ పాప నువ్వు తోపు అనే బీట్ సాంగ్ రిలీజ్

nandita dance with shankar on O Papa nivvu Topu beat song
nandita dance with shankar on O Papa nivvu Topu beat song
''ఓ మంచి ఘోస్ట్'' (OMG) శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వైవిధ్యమైన హారర్ కామెడీ చిత్రం. మార్క్ సెట్ నెట్ వర్క్స్ బ్యానర్ పై డా. అభినిక ఐనాభాతుని నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ మోలోడీస్ సాంగ్స్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో హాస్యనటుడు వెన్నెల కిషోర్, షకలక శంకర్, బ్యూటీఫుల్ హీరోయిన్స్ నందితా శ్వేత, నవమి గాయక్ లతో పాటు రజిత్, నవీన్ నేని, రఘు తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ సాంగ్ అయిన పాప నువ్వు తోపు పాటను మీడియా సమక్షంలో రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా విడుదల చేసారు.
 
Shankar Marthand, Dr. Abhinika Ainabhatuni, Anup Rubens,  Shakalaka Shankar, Nandita Swetha
Shankar Marthand, Dr. Abhinika Ainabhatuni, Anup Rubens, Shakalaka Shankar, Nandita Swetha
మొట్టమొదటిసారి మీడియా ప్రతినిధులతో పాటను ఆవిష్కరించిన ఘనత ఓఎంజీ టీమ్ కు దక్కింది. మంచి మాస్ బీట్ తో జానపద పాటని సినిమా స్టయిల్ లో మ్యూజిక్ డైరెక్టర్ అనూబ్ రూబెన్స్ అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ పాటను యువ రచయిత సింహాచలం రాయగా.. అలవైకుంటపురంలో సిత్తరాల సిరపడు పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలసురన్న పాడారు. అలాగే కమెడియన్ శకలక శంకర్ కూడా పాటలో కొంత భాగం పాడారు. ఈ సందర్భంగా పాట రచయిత సింహాచలం మాట్లాడుతూ.. ఇంత మంచి సినిమాలో పాట రాసే అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ కి ధన్యవాదాలు తెలిపారు. పాట పాడిన బాల సురన్న మాట్లాడుతూ.. తనకు చదువు రాకపోయినా, అనూప్ రూబెన్స్ లాంటి సంగీత దర్శకుడు ఉంటే ఎలాంటి పాటనైనా అవలీలగా పాడేస్తానని అన్నారు. ఇలాగే అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో మరిన్ని పాటలు పాడాలని తన కోరికను తెలిపారు.
 
ప్రొడ్యూసర్ డా అభినిక తండ్రి రాధాకృష్ణ మాట్లాడుతూ... మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మట్టిని పట్టుకుంటే బంగారము కాదు వజ్రము అవుతుందని, ఆయన సమకూర్చిన ఓ ఎం జి సినిమాలోని ప్రతీ పాట అద్భుతంగా ఉందని కొనియాడారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని ఇది కచ్చితంగా విజయవంతం అవుతుందని తెలిపారు. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరు తమ క్యారెక్టర్లు గుర్తుండిపోయేలా నటించారని తెలిపారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు చాలా హాయిగా.. టైమే తెలియకుండా గడిసిపోతుందని తెలిపారు.
 
నటుడు రజిత్ మాట్లాడుతూ ఓ ఎం జి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ మార్తాండ్ శంకర్ కి ధన్యవాదాలు తెలిపారు.అలాగే తాను మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ కు అభిమాని అని, ఆయన సంగీతం సమకూర్చిన సినిమాలో నటించడం తన అదృష్టం అని చెప్పారు.
 
డైరెక్టర్ మార్తాండ్ శంకర్ మాట్లాడుతూ అను రూబెన్స్ తనకు ఎక్స్పైరీ డేట్ వెబ్ సిరీస్ నుంచి పరిచయమని, అలా ఇద్దరము కలిసి OMG సినిమాకు పని చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. నిర్మాత అభినిక గురించి మాట్లాడుతూ... సినిమాకు వారు చాలా సపోర్ట్ చేశారని, ఇలా సపోర్టు చేస్తే ప్రతీ దర్శకుడు అద్భుతాలను తెరకెక్కిస్తారని తెలిపారు. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులకు, తన డైరెక్టర్ టీంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డిఓపి ఐ ఆండ్రూ మొదటి రోజు నుండి తనకు చాలా బాగా సపోర్ట్ చేశాడని, సినిమా కూడా మంచి విజువల్స్ తో చాలా క్వాలిటీగా ఇచ్చారని చెప్పారు. అలాగే హర్రర్ కథలకు మ్యూజిక్ గుండె లాంటిదని, అందుకు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇచ్చారు అన్నారు. సినిమా కంటెంట్ అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని తెలిపారు.
 
డిఓపి ఐ ఆండ్రూ మాట్లాడుతూ తానకు గతంలో లవ్ స్టోరీలు, యాక్షన్ డ్రామాలు చేసిన అనుభవం ఉందని కానీ మొదటిసారి హర్రర్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించడం కొత్తగా ఉందని తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పారు.
 
యాక్టర్ షకలక శంకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తనను ఇండస్ట్రీలో హర్రర్ స్టార్ అంటున్నారని, అదే తరహాలో హారర్ కామెడీతో ఓఎంజి చిత్రం ఉంటుందని, తనకు పేరు తెచ్చిన గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో అంతకుమించిన కామెడీ, హర్రర్, ఎంటర్ టైన్మెంట్స్ ఉంటుందని చెప్పారు. సినిమాలో అవకాశమిచ్చిన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ లకు తన కృతజ్ఞతలు తెలిపారు.
 
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ హర్రర్ కామెడీ నేపథ్యంలో డైరెక్టర్ మార్తాండ్ శంకర్ ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు. అలాగే ఈ చిత్రంలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారని అన్నారు. మొదటి సాంగ్ "పైసా రే పైసా" విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయిందని, అదే మాదిరిగా "ఓ పాప నువ్వు తోపు" సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. సాంగ్ రాసిన సింహాచలం కు, పాడిన బాలసురన్నకు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పారు.
 
హీరోయిన్ నందిత శ్వేత మాట్లాడుతూ తాను ఇకమీదట హర్రర్ చిత్రాలలో నటించకూడదు అనుకుందట కానీ, దర్శకుడు కథ చెప్పిన విధానంతో ఓఎంజి సినిమాలో నటించానని చెప్పుకొచ్చింది. హర్రర్ చిత్రాలు అంటే ఒక పెద్ద ఎక్స్పరిమెంట్ అని దీనికి మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రాణమని అందుకు తగ్గట్టుగానే అనూప్ రూబెన్స్ సంగీతాన్ని, ఐ ఆండ్రూ విజువల్స్ ను అందించారని పేర్కొంది. తాజాగా విడుదలైన పాప నువ్వు తోపు పాట ఫుల్ మాస్ బీట్ తో ప్రేక్షకులను అలరిస్తుందని అలాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుందని తెలిపింది.
 
వినూత్నమైన హారర్ కామెడీగా తెరకెక్కుతున్న OMG "ఓ మంచి ఘోస్ట్" చిత్రం నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తుండగా... తాజాగా విడుదలైన పాటలు శ్రోతల్ని ఉర్రుతలుగిస్తుంది. ఈ చిత్ర ప్రారంభం నుంచి చివరి వరకు ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.  ఈ చిత్రంలో కామెడీతో పాటు ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టే హారర్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు.