ఓరి దేవుడా మోషన్ పోస్టర్.. విజయ్ సేతుపతి పాత్రలో స్టార్ హీరో

మంగళవారం, 9 నవంబరు 2021 (19:50 IST)
Ori Devuda
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో పివిపి సినిమా, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘ఓరి దేవుడా’. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. 
 
తమిళ్‌లో క్లాసిక్ లవ్ స్టోరీగా ట్రెండ్ క్రియేట్ చేసిన మూవీ ‘ఓ మై కడవులే’.. అశోక్ సెల్వన్, రితికా సింగ్, వాణి భోజన్ లీడ్ రోల్స్ చెయ్యగా.. విజయ్ సేతుపతి కీలక పాత్ర క్యారెక్టర్ చేశారు. ఈ సినిమానే తెలుగులో ‘ఓరి దేవుడా’ పేరుతో రీమేక్ చేస్తున్నారు.
 
రీసెంట్‌గా టైటిల్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అయిన హీరో, హీరోయిన్ లవ్ మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం కోర్టుకెళ్లడం, చివరకు వాళ్లు విడిపోయారా.. తిరిగి ఒక్కటయ్యారా? అనే ఆసక్తికర అంశాలతో తెరకెక్కిన ‘ఓ మై కడవులే’ తమిళనాట సూపర్ హిట్ అయ్యింది. 
 
స్టోరీ నేరేషన్ విజయ్ సేతుపతి పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. ఆ క్యారెక్టర్‌లో ఓ స్టార్ హీరో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయ్యింది. 

అన్నీ చూడండి

నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రొఫెసర్ మనీషా అరెస్టు

భార్యను గొడ్డలితో నరికేసి ఠాణాకు వెళ్లి లొంగిపోయిన వృద్ధుడు

లైంగిక వేధింపులు - భారత సంతతికి చెందిన 13 యేళ్ల జైలు

స్టాలిన్ ఓడిపోవడం బాధ కలిగించింది.. చౌకబారు వ్యక్తిని కాదు : రజనీకాంత్

ప్రాణాంతక ఎబోలా వైరస్ - హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ

అన్నీ చూడండి

మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు

మీ చాయ్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు

మితిమీరి గోధుమ రోటీలను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments