గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 31 జనవరి 2017 (05:33 IST)

పద్మావతిని అల్పంగా చూస్తారు సరే... ప్రవక్తపై సినిమా తీయండి చూద్దాం? కేంద్ర మంత్రి సవాల్

చిత్తోడ్ రాణి పద్మావతి హిందువు కాబట్టే ఆమెను సినీ పరిశ్రమ అల్పదృష్టితో చూస్తోందని కేంద్రమంత్రి గిరిరాజి కిషోర్ పేర్కొన్నారు. హిందూ దేవతలు, దేవుళ్లతో సినీ పరిశ్రమ ఆటాడుకుంటోందని కానీ ప్రవక్త ముహమ్మద్ మీద సినిమా తీసే సాహసం చేయలేరంటూ మంత్రి ఎద్దేవా చేశా

చిత్తోడ్ రాణి పద్మావతి హిందువు కాబట్టే ఆమెను సినీ పరిశ్రమ అల్పదృష్టితో చూస్తోందని కేంద్రమంత్రి గిరిరాజి కిషోర్ పేర్కొన్నారు. హిందూ దేవతలు, దేవుళ్లతో సినీ పరిశ్రమ ఆటాడుకుంటోందని కానీ ప్రవక్త ముహమ్మద్ మీద సినిమా తీసే సాహసం చేయలేరంటూ మంత్రి ఎద్దేవా చేశారు.  పద్మావతి చిత్రం షూటింగు సమయంలో దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీపై దాడి చేసిన కార్ని సేన గ్రూపు చేసిన చర్యను సరైందేనంటూ కేంద్ర మంత్రి సమర్థించారు. చరిత్ర వాస్తవాలను వక్రీకరించడంపై వ్యతిరేకత తెల్పడం సరైందేనని చెప్పారు. 
 
ఔరంగజేబు వంటి వ్యక్తులను మహా పురుషులుగా భావించే వారు పద్మావతి సినిమా తీస్తున్నారని మంత్రి విమర్ళించారు. చారిత్రక వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తే సహించకూడదని మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు. ప్రత్యేకించి హిందూ దేవతలు, దేవుళ్లపైనే చిత్రసీమ అన్ని రకాల వ్యాఖ్యానాలు చేస్తోందని,  ప్రవక్త ముహమ్మద్‌పై వీరిలో ఎవరైనా సినిమా చేయగలరా అని మంత్రి సవాల్ చేశారు. 
 
ఇకపై హిందూ కథానాయకులను ఎవరైనా అవమానిస్తూ చిత్రాలు తీస్తే సహించబోమని, దేశ సంస్కృతిని వక్రీకరించే ప్రయత్నం చేస్తే అలాంటి వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.  
 
పద్మావతిని ఈ సినిమాలో చూపిన విధానం చూస్తే, ఒకటనిపిస్తోంది. ఆమె హిందువు కాకపోయి ఉంటే ఎవరూ అలా తీసేవారు కాదు. పద్మావతి తన్ను తాను ధ్వంసం చేసుకుందే తప్పితే శత్రువుకు లొంగలేదు. ఆమెను తప్పుగా చిత్రించే వ్యక్తులను ప్రజలు శిక్షించాల్సిందే అని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు.