గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 డిశెంబరు 2021 (18:25 IST)

విజయ్ దేవరకొండ 'లైగర్' అప్‌డేట్ - 31న గ్లింప్స్ రిలీజ్

విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'లైగర్'. ఉప శీర్షిక 'సాలా క్రాస్‌బ్రీడ్'. పలు భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరెక్కుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, నటి చార్మీ కౌర్‌లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో మాజీ చాంపియన్ బాక్సర్ మైక్ టైసన్ ‌విలన్ పాత్రలో నటిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రానికి సంబంధించిన కొత్త సంవత్సరానికి ఒక్క రోజు ముందు అప్‌డేట్‌ను వెల్లడించనున్నారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 10.03 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన కీలక సమాచారంతో ఓ వీడియోను రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత 30వ తేదీన ఫ్యాన్స్‌ను ఆనందపరిచేలా బీటీఎస్ ఫోటోలను ఉదయం 10.03 గంటలకు రిలీజ్చేయనున్నారు. 31వ తేదీన గ్లింప్స్‌ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు.