శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (15:05 IST)

పవన్ ఫైర్ అయితే.. బాలయ్య ఫ్లవర్ బొకే ఇచ్చారు.. ఏం జరిగింది?

రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. పవన్ తన ప్రసంగంలో భాగంలో ఏపీ టికెట్ రేట్ల సమస్య గురించి స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ  సందర్భంగా పవన్ ఓ వ్యక్తిపై సీరియస్ అయ్యారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం తెలిసిందే.
 
అయితే స్టేజ్ పైకి వచ్చిన వ్యక్తి ఎవరనే క్లారిటీ లేకపోవడం వల్ల పవన్ తన ఫ్యాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారని కామెంట్లు వినిపించాయి. అయితే పవన్ ఏ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారో అదే వ్యక్తి అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కాగా బాలకృష్ణ ఆ వ్యక్తికి ఫ్లవర్ బొకే ఇచ్చారు. 
 
పవన్ అభిమానులు ఆ వ్యక్తి ఎవరని ఆరా తీయగా అసలు విషయం బయటకొచ్చింది. రిపబ్లిక్ ఈవెంట్ లో స్టేజ్ పైకి వచ్చిన ఈ వ్యక్తి పవన్ అభిమాని కాదని తెలిసింది. 
 
ఆరోజు హంగామా చేసిన ఈ వ్యక్తి ఈవెంట్ మేనేజర్ అని సమాచారం. పవన్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేయడని నెటిజన్లు, పవన్ అభిమానులు అంటున్నారు.