శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (10:09 IST)

పవన్ కల్యాణ్ కరోనా నెగటివ్ వచ్చినా ఎందుకు బయటికి రావట్లేదు..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. పవన్ కల్యాణ్ కరోనా నెగటివ్ వచ్చిన తర్వాత కూడా బయటికి రావట్లేదు. దాంతో అభిమానులు కంగారు పడుతున్నారు. సాధారణంగా కరోనా నెగిటివ్ తర్వాత బయటికి వచ్చేస్తుంటారు. అప్పటి వరకు క్వారంటైన్ లోనే ఉన్నా కూడా తర్వాత బయటి ప్రపంచంలోకి అడుగు పెడుతుంటారు. 
 
మళ్లీ జనంతో కలుస్తుంటారు. కానీ పవన్ మాత్రం చాలా రోజులుగా క్వారంటైన్‌లోనే ఉన్నాడు. కొన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉన్న ఈయన.. కొన్ని రోజులుగా క్వారంటైన్‌కు పరిమితం అయిపోయాడు. 
 
వకీల్ సాబ్ సినిమారిలీజ్ తర్వాత ఈయనకు కోవిడ్ వచ్చింది. అప్పట్నుంచి కూడా పవన్ బయటికి రావడం లేదు. పూర్తిగా తన ఫామ్ హౌజ్ లోనే ఉంటున్నాడు. అక్కడే వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని చూసుకుంటున్నారు.
 
నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా పవన్ బయటికి రాకపోవడం వెనక కారణం లోపల ఇన్ఫెక్షన్ ఉండటమే. పవన్ లంగ్స్ స్వల్పంగా ఇన్ఫెక్ట్ కావడంతో లోపలే ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ప్రమాదమేం లేదని.. పవన్ ఇప్పుడు పర్ఫెక్టుగా ఉన్నాడని.. ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్తున్నారు సన్నిహితులు. 
 
కాకపోతే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందనేది వైద్యుల సూచన. అందుకే నెగెటివ్ వచ్చాక కూడా బయటికి రావడం లేదు పవర్ స్టార్. ఇదంతా జరిగి మూడు నాలుగు రోజులు అవుతుంది కానీ ఇప్పటికీ పవన్ ఆరోగ్యంలో మాత్రం ఎలాంటి మెరుగుదల కనిపించడ లేదని తెలుస్తుంది. ఇప్పటికీ బలహీనంగానే ఉన్నాడు పవన్.
 
ఈయన ఆరోగ్యం పూర్తిస్థాయిలో కుదుట పడాలంటే మరో రెండు వారాలు పడుతుందని ప్రచారం జరుగుతుంది. అప్పటి వరకు బయటికి రాకుండా క్వారంటైన్‌లోనే ఉండాలని చూస్తున్నాడు పవర్ స్టార్. అభిమానులు ఈయన ఆరోగ్యం గురించి తెలుసుకుని కంగారు పడుతున్నారు. హైదరాబాద్ శివార్లలోని శంకర్ పల్లి ఫామ్ హౌజ్‌లో ఉన్నాడు పవన్. 
 
ఎలాగూ బయటికి వచ్చినా కూడా షూటింగ్స్ ఏం జరగడం లేదు.. పైగా పరిస్థితులు కూడా బాగోలేవు. వచ్చినా చేసేదేం లేదని క్వారంటైన్ లోనే ఉంటున్నాడు పవన్. ప్రస్తుతం ఈయన హరిహర వీరమల్లుతో పాటు అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్ లలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.