బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2017 (16:03 IST)

అభిమానుల ప్రేమ నన్ను బతికించింది.. లేకుంటే... : పవన్ కళ్యాణ్ (FULL SPEECH VIDEO)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'అజ్ఞాతవాసి'. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'అజ్ఞాతవాసి'. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో హీరో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగిస్తూ, 'జానీ' సినిమా పరాజయం తర్వాత నా సన్నిహితులైన ప్రతి ఒక్కరు ప్రాణాలు పోయినంతగా బాధపడుతుంటే వైరాగ్యం వచ్చింది. ఇలాంటి సమాజం, వ్యక్తుల మధ్య ఉండకూడదని నాలో నేనే ఓ గోడ నిర్మించుకున్నాను. నేను చేయూతనిచ్చినవాళ్లు, నా అండతో పైకొచ్చిన వాళ్లు నా కోసం ఎప్పుడూ నిలబడలేదు. కానీ అభిమానుల ప్రేమ నన్ను బతికించింది. నన్ను ఇంకా సినిమాల్లో ఉంచింది. వారికోసం నాకు చొక్కాలు చించుకోవాలని, గుండెలు చూపించాలని ఉంటుందన్నారు.
 
ముఖ్యంగా, సినిమాల్లో అడుగుపెట్టే సమయంలో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదిస్తానని ఊహించలేదు. సమాజానికి ఉపయోపడే ఏదైనా మంచిపని చేస్తే చాలనుకున్నాను. ప్రజాసమస్యలను పరిష్కరించడానికి సరైన వేదికను ఇచ్చిన సినిమా తల్లికి పాదాభివందనం చేస్తున్నాను. కెరీర్ ప్రారంభంలో ఎన్ని సినిమాలు చేస్తావని ఇంట్లో వారు అడిగినప్పుడు ఓ 10, 12 కంటే ఎక్కువ కనిపించలేదు. 'ఖుషి' తర్వాత కొన్ని సినిమాలు చేసి చిత్రసీమను వదిలేయాలనుకున్నాను. కానీ అభిమానుల ప్రేమ నాతో పాతిక సినిమాలు చేయించింది. ఓటమికి నేనేప్పుడు భయపడను. అలాగని గెలుపును చూసి పొంగిపోను. సంబంధం లేకుండానే ఒక్కోసారి మనం చేసేపని అసూయ, ద్వేషాలకు దారితీస్తుందని చిత్రపరిశ్రమ ద్వారా తెలుసుకున్నాను. 
 
అలాంటి వాతావరణంలో ఇమడలేక సినిమాల నుంచి విరమించుకోవడానికి నా మనసు ఎప్పుడు సిద్ధంగా ఉండేది. 'జానీ' సినిమా పరాజయం తర్వాత నా సన్నిహితులైన ప్రతి ఒక్కరు ప్రాణాలు పోయినంతగా బాధపడుతుంటే వైరాగ్యం వచ్చింది. ఇలాంటి సమాజం, వ్యక్తుల మధ్య ఉండకూడదని నాలో నేనే ఓ గోడ నిర్మించుకున్నాను. నేను చేయూతనిచ్చినవాళ్లు, నా అండతో పైకొచ్చిన వాళ్లు నా కోసం ఎప్పుడూ నిలబడలేదు. కానీ అభిమానుల ప్రేమ నన్ను బతికించింది. నన్ను ఇంకా సినిమాల్లో ఉంచింది. వారికోసం నాకు చొక్కాలు చించుకోవాలని, గుండెలు చూపించాలని ఉంటుంది. నాకు ఇష్టమైన జెండా భారతదేశపు జెండా. అది చూసినప్పుడల్లా నా గుండె ఉప్పొంగుతుంది. ఆ జెండా కోసం, దేశం కోసమే రాజకీయల్లోకి వచ్చాను. 
 
సినిమాల్లో మాదిరిగానే ఉడతాభక్తిగానైనా దేశంకోసం పాటుపడతాను. ఓ సినిమా విజయం సాధించినప్పుడు, గెలుపుబాటలో ఉన్నప్పుడు మనవెంట చాలామంది ఉంటారు. ఓటమి ఎదురయ్యే సమయంలో ఒక్కరు కనిపించరు. త్రివిక్రమ్ నా దగ్గరకు వచ్చి మీరు మళ్లీ సినిమాలు చేయాలని నాలో ధైర్యాన్ని నింపారు. త్రివిక్రమ్ నా కారణంగానే దర్శకుడు కాలేదు. స్వశక్తితోనే ప్రతిభను చాటుకున్నారు. సృజనాత్మకత ఉన్న వ్యక్తులకు హీరోలు ఎప్పుడైనా దొరుకుతారు. 
 
పెద్దలు, సినిమా పరిశ్రమ అంటే మోకరిల్లే గౌరవభావం కలిగిన ఆలోచన ధోరణే మమ్మల్ని కలిపింది. నిరాశానిస్పృహలకు లోనైనప్పుడు గుంటూరు శేషేంద్రశర్మ కవితలతో నన్ను ఉత్తేజపరిచారు. పాతిక సినిమాల ప్రయాణంలో నా సినిమా బాగుంటుంది అని ఎప్పుడూ చెప్పలేదు. అందరిని మెప్పించేలా మావైన ఆలోచనలు, ప్రయత్నంతో చేసిన సినిమా ఇది. నా హృదయ వైశాల్యం ఎంత ఉంటుందంటే.. అభిమానించే ప్రతి ఒక్కరినీ నా గుండెల్లో పెట్టుకోవాలని ఉంటుంది. నా సినిమా చూడమని తానెప్పుడూ చెప్పనని.. బలవంతపెట్టని.. నచ్చితేనే చూడాలి. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ తమ వంతు కృషి చేసిందని ఆయన చెప్పుకొచ్చాడు.