బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 24 డిశెంబరు 2024 (21:59 IST)

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

At Annamayya Statue
Annamayya Statue తిరుపతిలోని కూడలిలో వున్న అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో బయటపడింది. ఎవరో రోడ్డుపై తిరిగే ఓ పిచ్చివాడు తన భుజానికి ఓ మూట తగిలించుకుని కూడలిలోని అన్నమయ్య విగ్రహం వున్నచోట రౌండ్ చుట్టాడు. అనంతరం ఇనుప గేటు తీసుకుని అన్నమయ్య విగ్రహం వద్దకు వెళ్లి శాంతాక్లాజ్ టోపి పెట్టాడు. ఇదంతా సిసిటీవీ వీడియోలో రికార్డయ్యింది.
 
కాగా అంతకుముందు వైసిపి నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ పెట్టడంపై కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ కబుర్లు చెప్పే చంద్రబాబు, పవన్ కల్యాణ్ దీనికి పూర్తి బాధ్యత వహించాలంటూ వ్యాఖ్యానించారు. ఐతే ఎట్టకేలకు ఈ టోపీ వ్యవహారం ఓ పిచ్చివాడి పని అని సిసి కెమేరా ద్వారా వెల్లడైంది.