బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 డిశెంబరు 2024 (13:54 IST)

ఏఐ చాట్‌బాట్‌లు, ఆటోమేషన్‌ను ఉపయోగించనున్న టీటీడీ.. ఎలాగంటే..? (video)

AI Tirumala
AI Tirumala
తిరుమల తిరుపతి దేవస్థానం ఏఐ చాట్‌బాట్‌లు, ఆటోమేషన్‌ను ఉపయోగించనుంది. శ్రీవారి ఆలయాన్ని సందర్శించే భక్తుల సేవలను మెరుగుపరిచేందుకు.. విజన్ 2047లో భాగంగా తిరుమల పవిత్రతను కాపాడుతూనే.. దర్శనం, వసతులకు సంబంధించిన సేవలను మెరుగుపరుచనుంది. 
 
ఇదెలా సాధ్యమంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా రూపొందించిన ఒక ఫేస్ రికగ్నైజేషన్ మిషన్ లేదా కియోస్కి వద్ద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడంతోటే మన ఫేస్ క్రీమ్‌పై కనిపిస్తుంది.. అలాగే ఆ మిషన్ మనకు దర్శనం స్లిప్పులను కూడా ఇస్తుంది. ఇక స్లిప్పులు తీసుకొని నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో పేస్ రికగ్నిషన్ ఎంట్రీ పద్ధతి ద్వారా లోపలికి వెళ్ళిపోవచ్చు. 
 
దీనికి సంబంధించిన పూర్తి డెమోని టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు , బోర్డు సభ్యులు, ఈవోతో కలిసి తిలకించారు. ఇదే విషయాన్ని టీటీడీ చైర్మన్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియపరుస్తూ వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఓ రెండు కంపెనీలు తమ డెమోని సబ్మిట్ చేశాయి.. వీళ్లతో పాటు మరికొన్ని సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయని తెలిసింది. 
 
ఇకపోతే.. గంటల తరబడి క్యూలైన్‌లో నిరీక్షించే అవసరం లేకుండా గంట.. రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేలా ఏఐ సహకారంతో ఫేస్‌ రికగ్నేషన్‌ ఎంట్రీ విధానాన్ని సోమవారం టీటీడీ బోర్డు సభ్యులు పరిశీలించారు. మెరుగైన విధానాలను పరిశీలించి, త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తేనున్నారు.