బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2017 (09:01 IST)

'అజ్ఞాతవాసి' పాటలు... Jukebox (వీడియో)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రం వచ్చే నెల పదో తేదీన రిలీజ్ కానుంది. అయితే, ఈ చిత్రం ఆడియో వేడుక మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని నోవాటెల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రం వచ్చే నెల పదో తేదీన రిలీజ్ కానుంది. అయితే, ఈ చిత్రం ఆడియో వేడుక మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగింది.
 
ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్, పవన్, ఖుష్బు, అను ఇమ్మాన్యుయేల్, కీర్తీ, అనిరుధ్ పలువురు హాజరై సీడీని ఆవిష్కరించారు. హీరోయిన్లుగా అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌‌లు నటించారు. అలనాటి తార ఖుష్బు, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించారు. 
 
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీత బాణీలు సమకూర్చుతుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు కోసం వీడియోలో వినేయండి..