పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో టీజర్ అప్డేట్
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బ్రో చిత్రం అప్డేట్ ఇచ్చేసారు. త్యరలో థియేటర్స్ లో టీజర్ విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. తమిళ హిట్ మూవీ వినోదయ సిత్తం కి రీమేక్ గా తెస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను జులై 28న భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తి అయింది. ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, రాజా చెంబోలు, తనికెళ్ళ భరణి తదితరులు నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.