శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 26 జూన్ 2023 (10:54 IST)

'ఓజీ' సెన్సేషన్స్ ఖాయం... అర్జున్ దాస్

og movie still
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీరికి వర్కింగ్ టైటిల్‌గా ఓజీ పెట్టారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు వరుస అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది చిత్రబృందం. మాములుగానే పవన్‌ సినిమా వస్తుందంటే సినీ ప్రియుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. 
 
ఇక తాజాగా ఈ చిత్రంలోని నటీనటులు పంచుకుంటున్న విషయాలు ఓజీపై అంచనాలు రెట్టింపయ్యేలా చేశాయి. భారీ తారాగణంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కీలక పాత్రలో నటిస్తున్న కోలీవుడ్‌ హీరో అర్జున్‌ దాస్‌ మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్‌ చూపించారు. వాటిని చూసి షాక్ అయ్యాను. అద్భుతంగా ఉన్నాయి. అలాగే పవన్‌  స్క్రీన్‌ ప్రజెన్స్‌, డైలాగులు ఓ రేంజ్‌లో ఉన్నాయి. నేను ఆయన అభిమానులకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. మీరంతా సిద్ధంగా ఉండండి. త్వరలోనే అగ్ని తుఫాను రానుంది' అని ట్వీట్‌ చేశారు.
 
అదేవిధంగా, 'మొదట ఈ సినిమాలో ఆఫర్‌ వచ్చినప్పుడు కమర్షియల్‌ స్టోరీ ఏమో.. విని నో చెప్పేద్దామని అనుకున్నాను. కానీ, సుజిత్‌ చెప్పిన కథ విన్న 5 నిమిషాల్లోనే ఓకే చెప్పేశాను. నాకు ఆ కథ అంత నచ్చింది. చాలా కొత్తగా ఉంది' అని ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన శ్రియా రెడ్డి తెలిపారు.