సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 జూన్ 2023 (16:08 IST)

పంది వాహనంపై తిరుగుతున్న పవన్ ... ఆయన వెంట ఉండే కాపులంతా పిచ్చోళ్లు : అంబటి రాంబాబు

ambati rambabu
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై వైకాపా నేత, ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోమారు నోరు పారేసుకున్నారు. పవన్‍ను పందితో పోల్చిన అంబటి... పవన్ కళ్యాణ్ అనే పంది ఎక్కి తిరుగుతూ బురద చిమ్ముతుందన్నారు. 'వారాహి అంటే అమ్మవారి రూపం. కానీ, పవన్‌ కల్యాణ్‌ ఎక్కినది మాత్రం పంది. ఆ పంది ఎక్కి తిరుగుతున్న పవనే శాడిస్ట్‌ట అని మండిపడ్డారు. 
 
సీఎం కార్యాలయం వద్ద మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, 'పవన్‌ కళ్యాణ్‌ వెనుక తిరుగుతున్న కాపులు పిచ్చోళ్లు. దీపం వెలుగుతున్నప్పుడు దోమలు వెళ్లి దాంట్లో పడి చచ్చిపోతాయి. అట్లా మా కాపు యువకులు, పెద్దలు ఆయనేదో ముఖ్యమంత్రి అవుతాడని వ్యాన్‌ చుట్టూ తిరుగుతున్నారు. అయ్యా.. కాపు సోదరులారా, తొందర పడకండయ్యా అని చెప్పే ప్రయత్నం తప్ప... పవన్‌ కళ్యాణ్‌ని విమర్శించాలని మాకేమీ లేదన్నారు.
 
కాపులకు అవసరం వచ్చినప్పుడు వారికి అండదండగా నిలబడిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. పవన్‌ కళ్యాణ్‌కు, హరిరామ జోగయ్యకు కాపుల గురించి మాట్లాడే అర్హత లేదు. తనకు ప్రాణహాని ఉందని మాట్లాడుతున్న పవన్‌.. ఆ విషయంపై ఎందుకు ఫిర్యాదు చేయలేదు? రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంటున్న పవన్‌ని మేము ఏదో చేయాల్సిన అవసరం ఏముంది? దొంగ మాటలు చెబితే పవన్‌ కళ్యాణ్‌ను కాపులెలా నమ్ముతారు?’ అని మంత్రి ప్రశ్నించారు.