బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 మే 2020 (09:09 IST)

'ఊసరవెల్లి' హీరోయిన్‌కు కరోనా వైరస్ సోకిందా?

తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన కుర్ర హీరోయిన్లలో పాయల్ ఘోష్ ఒకరు. ఈమె ప్రయాణం, ఊసరవెల్లి వంటి చిత్రాల్లో నటించింది. అయితే, ఆమె ఇటీవల అనారోగ్యంపాలైంది. దీంతో ఆమెకు కరోనా వైరస్ సోకిందనే వార్తలు గుప్పుమన్నారు. ఎందుకంటే.. ఆమెలో కరోనా వైరస్ లక్షణాలే కనిపించాయి. 
 
ఇవి బయటకు పొక్కడంతో అందరూ కరోనా వైరస్ సోకిందని భావించారు. దీంతో ఈ అమ్మాడు పెదవి విప్పక తప్పలేదు. దీనిపై ఆమె స్పందించారు. తనకేమీ కరోనా సోకలేదని, మలేరియా మాత్రం వచ్చిందని, ఇప్పుడు బాగానే ఉందని క్లారిటీ ఇచ్చింది. ఇదే అంశంపై ఆమె ఓ ట్వీట్ చేశారు. 
 
'గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా. తొలుత తలనొప్పి, ఆపై జ్వరం వచ్చాయి. నాకు సోకింది కరోనా కాదని నాకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఇదేసమయంలో నా బంధుమిత్రులు మాత్రం ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా, మలేరియా జ్వరం అని తేలింది. 
 
ప్రస్తుతం కోలుకుంటున్నాను. ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ త్వరలోనే పూర్తి నియంత్రణలోకి వస్తుందని బలంగా నమ్ముతున్నాను. త్వరలోనే మనం సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తామని భావిస్తున్నాను' అంటూ ఆమె వ్యాఖ్యానించింది.