గోవాలో మందిరా బేడి... ఏం చేస్తుందో తెలుసా..?
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటిస్తోన్న తాజా చిత్రం రొమాంటిక్. ఆకాష్ పూరి సరసన కేతిక శర్మ నటిస్తుంది. ఈ విషయాన్ని ఇటీవలే చిత్ర యూనిట్ మీడియాకి తెలియచేసారు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ స్టోరీ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా గోవాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇక అసలు విషయానికి వస్తే... ఈ మూవీలో ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాత మరియు నటి మందిరా బేడి కీలక పాత్ర పోషిస్తుంది. గోవాలో జరుగుతోన్న షూటింగ్‌లో మందిరా బేడి జాయిన్ అయ్యారు. పూరి, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్ పైన రూపొందుతోన్న ఈ సినిమా అందమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతోంది.
ఆకాష్ పూరి నటించిన మెహబూబా సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో రొమాంటిక్ పైన చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి.. ఆకాష్‌కి రొమాంటిక్ చిత్రం ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.