సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 1 మే 2018 (12:55 IST)

పూరి పైన ఆకాష్ పూరి ఫిర్యాదు..!

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగ‌న్నాథ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం మెహ‌బూబా. ఈ సినిమా ద్వారా ఆకాష్ పూరిని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాడు. కొత్త‌మ్మాయి నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. 1971 ఇండో-పాక్ యుద్ధం నేప‌ధ్యంతో రూపొందిన ఈ సినిమాను, మే 11వ

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగ‌న్నాథ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం మెహ‌బూబా. ఈ సినిమా ద్వారా ఆకాష్ పూరిని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాడు. కొత్త‌మ్మాయి నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. 1971 ఇండో-పాక్ యుద్ధం నేప‌ధ్యంతో రూపొందిన ఈ సినిమాను, మే 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అంతా బాగానే ఉంది... కానీ.. పూరిపై ఆకాష్ పూరి ఫిర్యాదు చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..?
 
విష‌యం ఏంటంటే... ఇటీవ‌ల‌ ఆకాష్ పూరిని ఈ సినిమాకి నాన్న ఎంత రెమ్యూన‌రేషన్ ఇచ్చారు అని అడిగితే .. "నిజం చెప్పాలంటే మా నాన్న నన్ను హీరోగా పెట్టి సినిమా తీయడమే చాలా ఎక్కువ. అందువలన నేను పారితోషికం గురించి అడగలేదు. నేను అడగలేదు కదా అని ఆయన ఇవ్వలేదు. ఆయన పారితోషికం ఇస్తే మాత్రం తీసుకోవాలని వుంది" అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. 
 
ఆ సమయంలో అక్కడే వున్న పూరి .. 'ఈ సినిమా విడుదలైన తరువాత డబ్బులొస్తే, ఆకాష్‌ ఆశించే దానికంటే ఎక్కువ ఇస్తాను' అన్నారు. ఇక ఇటు తండ్రీ .. అటు కొడుకూ ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకం ఎంతవరకూ నిజమవుతుందో తెలియాలంటే మే 11 వ‌ర‌కు ఆగాల్సిందే..!