తేజ తప్పుకున్నాడు... మరి ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్టర్ ఎవరు..?
ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కించనున్నట్టు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రకటించినప్పటి నుంచి వివాదం మొదలైంది. ఆ తర్వాత బాలయ్యతో అభిమానులు, సన్నిహితులు వర్మ డైరెక్షన్లో ఎన్టీఆర్ బ
ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కించనున్నట్టు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రకటించినప్పటి నుంచి వివాదం మొదలైంది. ఆ తర్వాత బాలయ్యతో అభిమానులు, సన్నిహితులు వర్మ డైరెక్షన్లో ఎన్టీఆర్ బయోపిక్ చేయద్దని చెప్పడంతో వర్మ ప్లేస్‌లో తేజ వచ్చారు. దీంతో బాగా ఫీలైన వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీయనున్నట్టు ఎనౌన్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత సన్నిహితుల సూచన మేరకు వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ని పక్కన పెట్టేసాడు.
తేజ దర్శకత్వంలో బాలయ్య నటించే ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవం సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దసరాకి ఈ సినిమా రిలీజ్ అని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. ఇంతలోనే ఏమైందో ఏమో కానీ... ఊహించనివిధంగా తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తేజ ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు అనేది పక్కన పెడితే ఎన్టీఆర్ బయోపిక్‌కి డైరెక్టర్ ఎవరు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
అయితే... ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం... ఎన్టీఆర్ బయోపిక్‌కి నలుగురు దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆ నలుగురు ఎవరంటారా..? రాఘవేంద్రరావు, పి.వాసు, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్..! ఈ నలుగురిలో ఎవరో ఒకరు డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ నలుగురితో పాటు బాలయ్య పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అవును... బాలయ్యే ఈ సినిమాకి దర్శకుడు అంటున్నారు కొంతమంది. మరి.. ఎన్టీఆర్ బయోపిక్‌కి డైరెక్టర్ ఎవరు అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.