ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (10:18 IST)

శ్రీదేవిని అతడు బాగా ఇబ్బందిపెట్టేవాడు.. ఎవరో తెలుసా?

సినీనటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీదేవి హఠాన్మరణాన్ని సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. అయితే శ్రీదేవి మృతికి ఆస్తి గొడవలే కారణమని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీద

సినీనటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీదేవి హఠాన్మరణాన్ని సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. అయితే శ్రీదేవి మృతికి ఆస్తి గొడవలే కారణమని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీదేవి బాబాయ్ ఎం. వేణుగోపాల్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతాన్ని గుర్తు చేసుకున్నారు. బోనీకపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ తనను బాగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి శ్రీదేవి బాధపడేదని వేణుగోపాల్ అన్నారు. 
 
శ్రీదేవి మృతిలో ఏం జరిగిందో అర్థం కావట్లేదని.. తాము కూడా అందరిలాగానే టీవీల్లో చూసే తెలుసుకున్నామని చెప్పారు. అయితే బోనీకపూర్ తొలి భార్య కుమారుడు అర్జున్ కపూర్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని చెప్పేదని.. ఓసారి భర్త బోనీకి షుగర్ బాగా పెరిగిపోతే శ్రీదేవి చాలా భయపడిందని.. తనూ పిల్లలు ఏమైపోతామోనని  బాధపడిందని వేణుగోపాల్ తెలిపారు.
 
శ్రీదేవి సున్నిత మనస్కురాలని.. ఆమెకు ఎవరితోనూ గొడవలు లేవని స్పష్టం చేశారు. శ్రీదేవికి చికెన్, మటన్ అంటే చాలా ఇష్టమని, అయితే ముక్కుకు ఆపరేషన్ చేయించుకున్నాక తిండి బాగా తగ్గించిందని వేణుగోపాల్ చెప్పారు. సోదరి శ్రీలతతో కూడా డబ్బుల విషయంలోనూ మనస్పర్థలు వచ్చాయే తప్ప.. అంతకుమించి ఏమీ లేదన్నారు. బోనీ కపూర్ తమతో బాగుండేవారని.. తమను బాగా చూసుకునేదని ఆమె బాబాయ్ గుర్తు చేసుకున్నారు. ఎంత పెద్ద ఆర్టిస్టయినా.. ఆమెలో ఏమాత్రం గర్వం పెరగలేదని.. సింపుల్‌గా వుండేదని ఆయన చెప్పుకొచ్చారు.