బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi

శ్రీదేవి గురించి రామ్ గోపాల్ వర్మ లాస్ట్ ట్వీట్.. ఏమన్నాడంటే?

''ఇదే శ్రీదేవి గురించి నా లాస్ట్ ట్వీట్. ఇప్పటి నుంచి నేను ఆమె జీవించే ఉన్నారని.. మంచిగా ఉన్నారని ఊహించుకుంటాను. శ్రీదేవి గారు నేను మిమ్మల్ని ఇంతగా నవ్వించిన తర్వాత కూడా మీరు నన్నింతలా ఏడిపించడం చాలా

''ఇదే శ్రీదేవి గురించి నా లాస్ట్ ట్వీట్. ఇప్పటి నుంచి నేను ఆమె జీవించే ఉన్నారని.. మంచిగా ఉన్నారని ఊహించుకుంటాను. శ్రీదేవి గారు నేను మిమ్మల్ని ఇంతగా నవ్వించిన తర్వాత కూడా మీరు నన్నింతలా ఏడిపించడం చాలా అన్యాయం ఇంకెప్పటికీ మీతో మాట్లాడను లైఫ్ లాంగ్ మీతో కటీఫ్'' అని వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు గతంలో ఓ ఇంటర్వ్యూలో వర్మ, శ్రీదేవీ, రాఘవేంద్రరావు ఉన్న వీడియోను లింక్ చేశారు.
 
ఇదిలా ఉంటే.. శ్రీదేవి మరణంతో సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. దుబాయ్‌‌లో జరుగుతున్న బోనీకపూర్ బంధువు పెళ్లికి వెళ్లిన శ్రీదేవి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అర్ధరాత్రి బాత్రూంకు వెళ్లిన శ్రీదేవి గుండెపోటుతో ఆమె బాత్రూంలోనే కుప్పకూలిపోయారని సమాచారం.
 
ఆస్పత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయారని సమాచారం. సోమవారం ముంబైలోని జుహూలో గల శాంతాక్రుజ్ శ్మశాన వాటికలో శ్రీదేవి అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె కుటుంబీకులు ప్రకటించారు.