ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (15:58 IST)

#Sridevi చివరి స్టెప్పులు.. వీడియో

అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దిగ్గజ నటీమణి చివరి క్షణాలు ఆనందంగా గడిచినట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లిన శ్రీదేవి.. ఆ వివాహ వేడుకలో తన క

అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దిగ్గజ నటీమణి చివరి క్షణాలు ఆనందంగా గడిచినట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లిన శ్రీదేవి.. ఆ వివాహ వేడుకలో తన కుటుంబీకులతో కలిసి ఫోటోలు దిగారు. ఆ పెళ్లి వేడుక కోసం ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమంలో డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
 
బోనీ కపూర్‌తో శ్రీదేవి చేసిన స్టెప్పులకు అక్కడున్న వారంతా క్లాప్ చేశారు. బోని కపూర్‌ను ఆలింగనం చేసుకున్న శ్రీదేవి సంతోషంగా కనిపించారు. కానీ కొన్ని గంటల్లోనే ఆమె గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఇంకేముంది.. చివరి క్షణాల్లో శ్రీదేవి స్టెప్పులను ఈ వీడియోలో లుక్కేయండి.