బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (13:40 IST)

సిల్క్ స్మితకు అప్పటి నుంచే దూరమయ్యాను: మాస్టర్ శివశంకర్

అందాల తార సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్మిత అందానికి ఫిదా కాని వారంటూ వుండరు. అప్పట్లో సినీ ఇండస్ట్రీలో ఐటమ్ గర్ల్‌గా తన హవాను కొనసాగించిన సిల్క్ స్మితతో ఏర్పడిన విభేదాల గురించి

అందాల తార సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్మిత అందానికి ఫిదా కాని వారంటూ వుండరు. అప్పట్లో సినీ ఇండస్ట్రీలో ఐటమ్ గర్ల్‌గా తన హవాను కొనసాగించిన సిల్క్ స్మితతో ఏర్పడిన విభేదాల గురించి డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ నోరు విప్పారు. సిల్క్ స్మిత అందమైన ఆర్టిస్టని.. తనకు నచ్చిన తారల్లో ఆమె కూడా వున్నారన్నారు. 
 
అయితే సిల్క్ స్మిత మంచి పేరు తెచ్చుకున్నాక.. సొంతంగా డ్యాన్స్ మాస్టర్లను తయారు చేసుకుందని చెప్పారు. ముఖ్యంగా పులిగిరి సరోజను ఆమె రిఫర్ చేస్తుండేదని.. ఒక వేళ డేట్స్ సర్దుబాటు కాక తనలాంటి వారిని పెడితే.. స్మిత సరిగ్గా చేసేది కాదని చెప్పుకొచ్చారు. 
 
బాలకృష్ణ నటించిన భలే తమ్ముడు సినిమాలో స్మితతో పాట అనుకున్నాం. కానీ రిహార్సల్స్ ముగిశాక తనతో చేయనని అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసిందని.. అప్పటికే ఆ పాటకు మంచి స్టెప్స్ అనుకున్నాం. కానీ ఆమె వెనక్కి తగ్గడంతో స్మితకు తాను దూరమయ్యానని శివశంకర్ అన్నారు. స్మిత స్థానంలో జయమాలిని బాలయ్య సినిమాకు తీసుకున్నామని తెలిపారు.