ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (14:04 IST)

రకుల్‌ను ఎత్తేసిన సిద్దార్థ్... షాక్‌కు గురైన హీరోయిన్ (వీడియో)

బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఐయ్యారి'. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా, హీరో హీరోయిన్లు ఢిల్లీలో వ

బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఐయ్యారి'. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా, హీరో హీరోయిన్లు ఢిల్లీలో విస్తృతంగా తిరుగుతున్నారు. 
 
ఇందులోభాగంగా, ఢిల్లీలోని ఎస్ఆర్సీసీ కాలేజీలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్‌లో కాలేజీ విద్యార్థుల ఎదుట డ్యాన్స్ వేశారు. 'లేయ్‌ డూబా' అనే పాటకు డ్యాన్స్‌ చేస్తూ సిద్దార్థ్‌.. రకుల్‌ని అందరిముందు ఒక్కసారిగా ఎత్తుకున్నాడు. దీంతో అక్కడున్నవారంతా కేకలు, ఈలలు వేశారు. 
 
అనుకోని సంఘటనతో రకుల్ ఒక్కసారి షాక్‌కుగురై బాగా ఇబ్బంది పడినట్టు కనిపించింది. ఇకపోతే, ఈ కార్యక్రమానికి రకుల్‌ పొట్టి దుస్తులు వేసుకోగా, దాంతో సిద్దార్థ్‌.. రకుల్‌ని ఎత్తుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.