సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (11:22 IST)

అందరూ చూస్తుండగా.. వెనక నుంచి వచ్చి యువతికి ముద్దెట్టాడు..

అందరూ చూస్తుండగా.. ముంబై రైల్వే స్టేషన్‌లో ఓ యువతిని పబ్లిక్‌గా ముద్దు పెట్టేశాడు.. ఓ కామాంధుడు. పోలీసులు ఎంతగా గస్తీ కాస్తున్నా.. అమ్మాయిలు ఎంత అప్రమత్తంగా వున్నా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ముంబై

అందరూ చూస్తుండగా.. ముంబై రైల్వే స్టేషన్‌లో ఓ యువతిని పబ్లిక్‌గా ముద్దు పెట్టేశాడు.. ఓ కామాంధుడు. పోలీసులు ఎంతగా గస్తీ కాస్తున్నా.. అమ్మాయిలు ఎంత అప్రమత్తంగా వున్నా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ముంబై రైల్వే స్టేషన్లో పలువురు ప్రయాణీకులు చూస్తుండగానే.. ఓ కామాంధుడు యువతిని పట్టుకుని ముద్దెట్టుకున్నాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 
 
ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్తున్న అమ్మాయికి వెనుక నుంచి వచ్చిన ఓ కామాంధుడు ముద్దెట్టాడు. ఆ సమయంలో స్టేషన్‌‌లో చాలామంది వున్నా... ఏ ఒక్కరూ ఆ కామాంధుడిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. 
 
అతడు తనను స్టేషన్ బయటి నుంచే వెంబడిస్తూ వచ్చాడని తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనని అరెస్ట్ చేశారు. అతడి పేరు నరేష్ జోషి (43) అని విచారణలో తేలింది.