ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మురళి
Last Updated : ఆదివారం, 7 జనవరి 2024 (17:48 IST)

'ప్లాంట్‌మాన్‌’ చిత్రం సూపర్‌హిట్‌ కావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌ : నిర్మాత పన్నా రాయల్‌

plantman
కాలింగ్‌ బెల్‌, రాక్షసి వంటి హారర్‌ మూవీస్‌ని డైరెక్ట్‌ చేసిన పన్నా రాయల్‌ దర్శకత్వ పర్యవేక్షణలో డి.ఎం. యూనివర్సల్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మించిన చిత్రం ‘ప్లాంట్‌ మాన్‌’. చంద్రశేఖర్‌, సోనాలి జంటగా కె.సంతోష్‌బాబు దర్శకత్వంలో రూపొందిన సైంటిఫిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇటీవల విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. 
 
ఈ నేపథ్యంలో తమ చిత్రానికి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ఈ సమావేశంలో చంద్రశేఖర్‌, సోనాలి, నిర్మాత పన్నా రాయల్‌, దర్శకుడు కె.సంతోష్‌బాబు, బేబి ప్రేక్షిత, అక్కం బాలరాజు, అశోక్‌వర్థన్‌, రచయిత సాయికృష్ణ, తడివేలు,  బాలరాజు, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.
 
నిర్మాత పన్నా రాయల్‌ మాట్లాడుతూ ‘‘ఈరోజు మా గురువుగారు బి.ఎ.రాజుగారి పుట్టినరోజు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు ఉంటాయి. కాలింగ్‌ బెల్‌ నుంచి నన్ను ఎంతో సపోర్ట్‌ చేశారు. ఇప్పుడు ఈ బేనర్‌లో సినిమా చేసానని తెలిస్తే ఎంతో సంతోషంగా ఫీల్‌ అయ్యేవారు. డైరెక్టర్‌గా నేను అందరికీ పరిచయమే. నిర్మాతగా నేను చేసిన మొదటి సినిమా ఇది. ఒక చిన్న సినిమాగా ‘ప్లాంట్‌ మాన్‌’ను స్టార్ట్‌ చేశాము. 
 
కానీ, రిజల్ట్‌ మాత్రం అల్టిమేట్‌గా ఉంది. ఇలాంటి రెస్పాన్స్‌ వస్తే సంవత్సరానికి రెండు చిన్న సినిమాలు చేసి కొత్త వారిని ఇంట్రడ్యూస్‌ చెయ్యాలని ఉంది. ‘ప్లాంట్‌ మాన్‌’ చిత్రం ఇంత పెద్ద విజయాన్ని సాధించడానికి సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌ ముఖ్య కారణం. ఇంత పెద్ద సక్సెస్‌ నేను ఊహించలేదు. సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు’’ అన్నారు.
plantman
 
బేబి ప్రేక్షిత మాట్లాడుతూ ‘‘ఫస్ట్‌ మూవీ కాబట్టి కొంత టెన్షన్‌ ఉండేది. కానీ, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ నన్ను ఎంతో మోటివేట్‌ చేశారు’’ అన్నారు. అశోక్‌ వర్థన్‌ మాట్లాడుతూ ‘‘సినిమా చేస్తున్నప్పుడు చిన్న సినిమా అనిపించింది. కానీ, ఈ సినిమాలో రైటింగ్‌ స్కిల్స్‌ బాగున్నాయి. ఔట్‌ పుట్‌ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఆడియన్స్‌ రెస్పాన్స్‌ చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్‌’’ అన్నారు.
 
రచయిత సాయికృష్ణ మాట్లాడుతూ ‘‘నా టాలెంట్‌ని గుర్తించి ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్‌. ప్లాంట్‌ మాన్‌ అనేది ప్రోగ్రెసివ్‌ నేమ్‌. ఇలాంటి కంటెంట్‌తో వెస్ట్రన్‌ కంట్రీస్‌లో భారీ బడ్జెట్‌తో మంచి గ్రాఫిక్స్‌తో చేస్తారు. కానీ, అవేవీ లేకుండా ఉన్నంతలోనే ఎంతో అద్భుతంగా తీశారు. సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఎంతో పాజిటివ్‌గా రివ్యూలు ఇచ్చారు. ఈ సినిమా మరింత విజయంతం కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.  
 
బాలరాజు మాట్లాడుతూ ‘‘ఒక కొత్త కాన్సెప్ట్‌తో సినిమా స్టార్ట్‌ చేసి మాలాంటి కొత్తవారికి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా చూసిన వారు నా క్యారెక్టర్‌ బాగుందని చెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగించింది’’ అన్నారు.
 
అక్కం బాలరాజు మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నటించేందుకు వెళ్లిన మొదటి రోజు ఈ సినిమా ఎందులో రిలీజ్‌ అవుతుంది యూట్యూబా, ఓటీటీనా అని అడిగాను. ఓటీటీ అని చెప్పారు పన్నాగారు. సగం షూటింగ్‌ పూర్తయిన తర్వాత మళ్ళీ అదే ప్రశ్న అడిగాను. దానికి పన్నాగారు.. ఓటీటీలో కాదు, యూ ట్యూబ్‌లో కాదు థియేటర్లలోనే సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం అని చెప్పారు. కొత్తవారితో సినిమా స్టార్ట్‌ చేసి ఎంత కష్టమైనా భరించి మాలాంటి కొత్తవారిని తీసుకొని పెద్ద స్క్రీన్‌పై మమ్మల్ని చూపించిన పన్నా రాయల్‌గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో ఎంతో కామెడీ ఉంది. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు నవ్వుతూనే ఉంటారు. ఫ్యామిలీతో అందరూ చాలా హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది. ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత నాకు మరో రెండు ఆఫర్లు వచ్చాయి’’ అన్నారు. 
 
తడివేలు మాట్లాడుతూ ‘‘సినిమాలో నేను చేసింది చిన్న క్యారెక్టర్‌ అయినా ఎంతో బాగా వచ్చింది. 20 సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్‌ నాకు ఎంతో తృప్తినిచ్చింది. థియేటర్‌లో రెస్పాన్స్‌ కూడా అద్భుతంగా ఉంది’’ అన్నారు.
 
దర్శకుడు కె.సంతోష్‌బాబు మాట్లాడుతూ ‘‘మా ఈ చిన్న సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్‌. ఈ సినిమా చేయడానికి నిర్మాత పన్నా రాయల్‌గారే కారణం. నేను చెప్పిన లైన్‌ నచ్చి ఈ సినిమా స్టార్ట్‌ చేశారు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్‌ అవ్వడానికి పన్నాగారు, డిఓపి కర్ణన్‌గారు, సాయినాథ్‌గారు కారణం. నటీనటులు, టెక్నీషియన్స్‌ అందించిన సపోర్ట్‌తో ఇంత మంచి సినిమా చేయగలిగాను’’ అన్నారు.
 
హీరో చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ‘‘నెల క్రితం ఈ హాల్‌ బయట ఉండి చూసిన నన్ను ఇప్పుడు స్టేజ్‌ మీద కూర్చోబెట్టారు. పన్నాగారు కొత్తవారిని ఎంకరేజ్‌ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ సంక్రాంతి ఫెస్టివల్‌కి కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్‌ చేయదగ్గ సినిమా ఇది’’ అన్నారు. 
 
హీరోయిన్‌ సోనాలి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో అవకాశం డిఓపి కర్ణన్‌గారి ద్వారా వచ్చింది. దానికి నిర్మాత పన్నాగారు ఎంతో సపోర్ట్‌ చేశారు. స్టార్టింగ్‌లో కొంత నెర్వస్‌గా ఉంది. అందరూ నన్ను ఎంతో ఎంకరేజ్‌ చేశారు. ఒక మంచి సినిమాలో నేను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉంది. సినిమా థియేటర్లలో రన్‌ అవుతోంది. తప్పకుండా అందరూ చూడండి’’ అన్నారు.