సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2024 (18:15 IST)

సంధ్య థియేటర్, అల్లు అర్జున్ టీమ్ పై పోలీసులు కేసు నమోదు.

Sandhya theater
Sandhya theater
హైదరాబాద్ లోని ఆర్.టి.సి. క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ ఘటన పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప 2 ప్రీమియర్ ప్రదర్శన సందర్భంగా అల్లు అర్జున్ వస్తున్నాడని తెలియగానే ఏర్పడ్డ అభిమానుల తాకిడికి ఓ మహిళ చనిపోవడం విచారకరం. అయితే ఈ ఘటనపై మహిళ భర్త, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 
 
సెక్షన్ 105,118 BNS యాక్ట్ ప్రకారం  పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్న సందర్భం లో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు పెట్టారు. అల్లు అర్జున్ వస్తున్న విషయం పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీం పై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు మీడియాకు తెలియజేశాయి.