శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2024 (17:26 IST)

ప్రతి సినీ, మెగా అభిమానికీ నాగబాబు కొణిదెల విజ్నప్తి

Nagababu Konidela
Nagababu Konidela
మెగా బ్రదర్ నాగబాబు కొణిదెల సినిమా విజయం కావాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నిన్నటి నుంచే పుష్ప 2 సినిమా క్రేజ్ హల్ చల్ చేస్తున్న తరుణంలో ఆయన ఫలానా సినిమా అని పేరు చెప్పకుండానే సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. ఆయన మాటల్లోనే.. 
 
24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో వేల‌ మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే *సినిమా*. ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను.
 
ఇక పుష్ప 2 విషయానికి వస్తే, ఈ సినిమాలో వేలాదిమంది నటించారు. అమ్మవారి జాతరలో జనాలు నిజంగానే జాతరలా వున్నారు. నాగబాబు అన్నట్లు వందలాది మంది సిబ్బంది క్రిషి ఇందులో కనిపించింది. కోట్లరూపాయల నిర్మాతల ఖర్చు వెండితెరపై కనిపించింది. సో.. మెగా అభిమానులు అల్లు అర్జున్ సినిమాకు పట్టంకట్టాలని ఇన్ డైరెక్ట్ గా సందర్భానుసారంగా నాగబాబు స్పందించినట్లుంది.