శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 13 జనవరి 2019 (12:07 IST)

థాయ్‌ బాడీ మసాజ్ పేరుతో వ్యభిచారం.. ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విజయవాడలో అందమైన అమ్మాయిలతో థాయ్ మసాజ్ పేరుతో గుట్టుచప్పుడుకాకుండా సాగుతున్న వ్యభిచార గుట్టును పోలీసులు రట్టుచేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
విజయవాడ పట్టణంలోని పలు బ్యూటీ పార్లర్లలో మసాజ్ ముసుగులో వ్యభిచారం సాగుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ప్రత్యేక బృందం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. 
 
ఈ తనిఖీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన నలుగురు యువతులతో పాటు ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, కేరళకు చెందిన ముగ్గురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ పోలీసుల దాడిలో విదేశీ యువతులు పట్టుబడటం ఇదే తొలిసారి.
 
ఈ అమ్మాయిలను పోలీసులు రెస్క్యూ హోంకు తరలించారు. అలాగే, స్పా సెంటర్ల నిర్వాహకులపై ఐపీసీ 370(2), ఐటీపీ చట్టంలోని 3,4 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. పోలీసులు దాడులు నిర్వహించడంతో స్పా సెంటర్లకు విటులను తీసుకొస్తున్న మధ్యవర్తి రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.