బికినీలో పూజా హెగ్డె, కుక్కతో సమంత
ఫోటో కర్టెసి- ఇన్‌స్టాగ్రాం
టాలీవుడ్ టాప్ హీరోయిన్లందరూ దాదాపు సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా వుంటున్నారు. తమ దైనందిన జీవిత విశేషాలను ఎంతమాత్రం మొహమాటం లేకుండా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు.
తాజాగా టాప్ హీరోయిన్ పూజాహెగ్డె తన బికినీ ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఇక సమంత అయితే కుక్కను తన పక్కన పడుకోబెట్టుకుని హాయిగా నిద్రపోతున్న ఫోటోను షేర్ చేసింది.
పూజాహెగ్డె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాథేశ్యామ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సమంత తాజాగా పుష్పలో ఐటెం సాంగుతో ఊ... అంటావా అంటూ కిక్కెక్కించింది. త్వరలో హాలీవుడ్ సినిమాలో నటించబోతోంది.