శుక్రవారం, 9 జూన్ 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: బుధవారం, 9 మార్చి 2022 (11:27 IST)

పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లాలనుకున్నాను.. పూనమ్ కౌర్ భావోద్వేగం

పూనమ్ కౌర్ సినిమాల్లో అంతగా కనిపించకపోయినా.. సోషల్ మీడియా ద్వారా ఆమెకు సూపర్ క్రేజ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన పూనమ్ తాజాగా ఓ ప్రెస్‌ మీట్‌లో పూనమ్‌ కౌర్‌ భావోద్వేగానికి గురైంది. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు రావడంతో తాను కన్నీళ్లు ఆపుకోలేక పోయానని తెలిపింది.
 
తాను సినిమాలు వదిలేసి వెళ్లిపోవాలనుకున్నట్లు పేర్కొంది. 'మాయాజాలం' సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన పూనమ్.. తన జీవితాన్ని సినిమానే మార్చేసిందని చెప్పుకొచ్చింది. ఒక దశలో సినిమాలు వదిలేసి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోవాలనుకున్నట్లు పూనమ్ చెప్పుకొచ్చింది. 
 
దేశం వదిలి వెళ్లిపోతానని అమ్మతో చెప్పాను. కానీ చాలా క్లిష్టతరమైన పరిస్థితిలో రియలైజ్‌ అయ్యాను. దానివల్లే ఇక్కడ ఉన్నాను. ప్రతిరోజూ సీత, దుర్గ, ద్రౌపదిలానే తలచుకునేదాన్ని. అందువల్లే చాలా శక్తిని, ధైర్యాన్ని పొందానని వెల్లడించింది.
 
ఈ క్రమంలోనే ఉమెన్ సెంట్రిక్‌ మూవీ ఒకటి ఉందని నా ఫ్రెండ్ ఫోన్‌ చేసి చెప్పిందని పూనమ్ కౌర్‌ పేర్కొంది. ఇది నిజజీవిత సంఘటనల ఆధారంగా, భార్య గురించి చెప్పే కథ అని తెలిసాక ఒప్పుకున్నట్లు వెల్లడించింది. 'నాతి చరామిలోని శ్రీలత పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంది. మూడేళ్ల క్రితం నా ఆలోచనలు 18 ఏళ్ల అమ్మాయిలా ఉన్నాయి. ఇప్పుడు 50 ఏళ్ల మహిళగా ఉన్నాయి.' అని పూనమ్‌ కౌర్‌ వివరించింది.
 
పూనమ్ చాలా గ్యాప్ తర్వాత నాతి చరామిలో నటిస్తోంది. నాగు గవర దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియో 24 ఫ్రేమ్స్‌ ప్రొడక్షన్స్ పతాకంపై జై వైష్ణవి కె నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో అమెజాన్‌, హంగామా, సోనీ, టాటా స్కై వంటి 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మార్చి 10న విడుదల కానుంది.