శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (14:18 IST)

'రాధే శ్యామ్' అందుకే ఫట్ అయ్యిందేమో.. ప్రభాస్ స్పందన

radhe shyam
'రాధే శ్యామ్' ఫ్లాప్‌పై పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్ స్పందించాడు. 'రాధే శ్యామ్' ఫ్లాప్ కావడానికి కరోనానే కారణమని చెప్పాడు. ఈ చిత్రం రిలీజ్ సమయానికి కరోనా వ్యాప్తి ఇంకా పూర్తిగా తగ్గకపోవడమే కారణం అనుకుంటున్నానని ప్రభాస్ తెలిపాడు.

దాంతో పాటు తనను ప్రేమ కథల్లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడి ఉండకపోవచ్చు. లేదా ఆ స్క్రిప్టులోనే ఏదైనా లోపం కూడా ఉండి ఉండొచ్చు అంటూ ప్రభాస్ పేర్కొన్నాడు.
 
ఇంకా ప్రభాస్ మాట్లాడుతూ 'బాహుబలి' లాంటి సినిమాలు చేయడం తనకిష్టమే అన్నాడు. అయితే ఎప్పుడూ అలాంటి సినిమాల్లో మాత్రమే నటిస్తే తాను నటుడిగా కొత్తదనం చూడలేను. అలాగే పలు విభిన్నమైన చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానని.. అవి చిన్న బడ్జెట్‌ చిత్రాలైనా పర్లేదని చెప్పుకొచ్చాడు. 
 
ఇకపోతే.. ప్రభాస్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె చిత్రాలతో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.