దీపికా పదుకొనే బిగ్గెస్ట్ సూపర్‌స్టార్.. ఆమెకు బిగ్ ఫ్యాన్: ప్రభాస్
కల్కి 2898-AD నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్, దిశా పటానీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రూపొందుతోంది. 'కల్కి 2898-AD' చిత్రానికి సంబంధించిన క్లింప్స్ వీడియో ఇటీవల విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కల్కి హీరో ప్రభాస్ మాట్లాడుతూ.. దీపిక సూపర్ స్టార్ అని కొనియాడాడు.
దీపికా పదుకొనే బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ అని కితాబిచ్చాడు. చాలా అందమైన అమ్మాయి, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. సెట్‌లో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. తనకు ఎప్పుడూ దీపికా ఇష్టం. ఆమెతో కలిసి పనిచేయడం గ్రేట్.
ఆమెతో తొలిసారి కలిసి పనిచేస్తుండటం ఓ మధురమైన అనుభూతి అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఇంకా కల్కిలో కమల్, అమితాబ్ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తుండటాన్ని తానిప్పటికీ నమ్మలేకపోతున్నానని ప్రభాస్ వెల్లడించాడు.